AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking News: మాజీ భార్యే సవతి తల్లి అయిందని తెలిసి అతడి దిమ్మతిరిగిపోయింది

కొన్నిసార్లు న్యూస్ వింటే.. ఇలాంటి ఘటనలు కూడా సొసైటీలో జరుగుతాయా అని ఆశ్చర్యపడుతుంటారు కొందరు. తాజాగా విస్మయం కలిగించే వార్తను మీ ముందుకు తీసుకువచ్చాం.

Shocking News: మాజీ భార్యే సవతి తల్లి అయిందని తెలిసి అతడి దిమ్మతిరిగిపోయింది
Wedding Viral News
Ram Naramaneni
|

Updated on: Jul 04, 2021 | 3:53 PM

Share

కొన్నిసార్లు న్యూస్ వింటే.. ఇలాంటి ఘటనలు కూడా సొసైటీలో జరుగుతాయా అని ఆశ్చర్యపడుతుంటారు కొందరు. తాజాగా విస్మయం కలిగించే వార్తను మీ ముందుకు తీసుకువచ్చాం. తండ్రీకొడుకుల మధ్య విబేధాలు ఉండటం సహజం. చదువు,  ఉద్యోగం, ప్రేమ విషయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవలు అయిన ఘటనలు మనం చూసి ఉంటాం. లేదంటే తొబుట్టువుల్లో ఒకరిని బాగా చూస్తున్నారని.. తనను చూడటం లేదని వివాదాలు రేగిన ఘటనలు చూసి ఉంటారు. అయితే అన్నింటికీ భిన్నంగా, విన్న వారందరినీ షాక్​కు గురిచేస్తూ.. ఉత్తర్​ప్రదేశ్​ బదాయూ జిల్లాలో ఓ ఘటన జరిగింది. ఇక్కడ తండ్రీకొడుకులు గొడవపడింది ఓ మహిళ కోసం. కొడుకు నుంచి విడాకులు తీసుకున్న భార్య.. ఇప్పుడు తండ్రిని పెళ్లి చేసుకుంది. వరసల ప్రకారం చూస్తే, అప్పటివరకు భార్యగా ఉన్న ఆమె.. ఆ కొడుకుకు ఇప్పుడు సవతి తల్లి అయ్యింది. ఈ మాట వినగానే మీకు కూడా దిమ్మతిరిగింది కదా..!. పదండి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

2016లో సంబంధిత వ్యక్తికి ఓ అమ్మాయితో వివాహమైంది. అప్పటికి వారిద్దరూ మైనర్లే. కాగా 6 నెలల తర్వాత అభిప్రాయ బేధాలు వచ్చి వారిద్దరూ విడిపోయారు. ఆమెతో తిరిగి కలిసి జీవించేందుకు అతను ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అతనొక తాగుబోతని, తనకు విముక్తి కావాలని చెప్పి ఆమె విడాకులు తీసుకుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి అతని తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. వెంటనే జిల్లా పంచాయతీ అధికారులను ఆశ్రయించాడు. తన తండ్రి వివరాలు సేకరించాలని ఆర్​టీఐ దాఖలు చేశాడు. ఇక్కడే అసలు బాగోతం వెలుగుచూసింది. ఆ 48 ఏళ్ల తండ్రి.. కొన్నేళ్ల క్రితం కొడుకు పెళ్లిచేసుకున్న అమ్మాయిని తిరిగి వివాహమాడి, సంభాల్​ ప్రాంతంలో కలిసి జీవితం సాగిస్తున్నాడని తెలిసింది. అంటే.. భార్య స్థానంలో ఉన్న మహిళ ఇప్పుడు ఆ కొడుకుకు సవతి తల్లిగా మారింది. ఇక ఈ వార్త వినగానే ఆ కొడుకు షాక్‌కు గురయ్యాడు.  అనంతరం బిసౌలీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు తండ్రీకొడుకుల మధ్య ఇటీవలే ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. కానీ వారిద్దరూ వాగ్వివాదానికి దిగారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అయితే తల్లిగా మారిన ఆ మాజీ భార్య మాత్రం.. రెండో భర్తతోనే సుఖంగా ఉన్నట్టు తెలిపింది. మొదటి భర్త దగ్గరకు వెళ్లే ప్రసక్తే లేదని పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చింది.

Also Read: అసిస్టెంట్​ డైరెక్టర్​తో స్టార్ హీరో కుమార్తె, ప్రస్తుత​ హీరోయిన్​ డేటింగ్​ !

సండే క‌రోనా వ్యాప్తికి సెల‌వు లేదండి..! ఆదివారం చేప‌ల మార్కెట్ల వ‌ద్ద ఏందీ లొల్లి