Coronavirus: సండే కరోనా వ్యాప్తికి సెలవు లేదండి..! ఆదివారం చేపల మార్కెట్ల వద్ద ఏందీ లొల్లి
కరోనా గిరోనా జాన్తా నై అంటున్నారు హైదరావాద్ జనం. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రోడ్లపైకి వచ్చి చక్కర్లు కొడుతున్నారు. ఇక ఆదివారం పూట జనం సందడి...
కరోనా గిరోనా జాన్తా నై అంటున్నారు హైదరావాద్ జనం. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రోడ్లపైకి వచ్చి చక్కర్లు కొడుతున్నారు. ఇక ఆదివారం పూట జనం సందడి మామూలుగా లేదు. నీసు మార్కెట్లయితే కిటకిటలాడుతున్నాయి. ముక్కలేనిదే ముద్ద దించేది లేదని డిసైడయ్యారు. చాపల బజార్ అంటే హైదరాబాదోళ్లకు టక్కున గుర్తొచ్చేంది రాంనగర్ మార్కెట్టే. ఎవరికి ఎలాంటి చాప కావాలి అన్నా అక్కడికి వెళ్తే దొరకుతుందన్న భరోసా ఉంటుంది. అందుకే ఆదివారం వచ్చిందంటే చాలు ఉదయాన్నే రాంనగర్‌కు క్యూ కడుతున్నారు. ఇక ఇంతకాలం కరోనా భయంతో ఇంట్లోనే దాక్కున్న చాపల ప్రియులు కూడా ఇప్పుడు వ్యాధి వ్యాప్తి తగ్గడంతో మార్కెట్లకు ఎగబడి వస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా జనం రావడంతో రామ్‌నగర్ ఫిష్ మార్కెట్ జనంతో కిక్కిరిసిపోయింది. మాస్కు లేదు.. భౌతికదూరం లేదు. నో కరోనా…నో క్యూ…గుంపులు గుంపులుగా చాపలు కొనేటందుకు పోటీపడుతున్నారు. చికెన్, మటన్ కంటే చేపలే మేలు అని చెబుతున్నారు. చాపల కూర ఇమ్యూనిటీ బూస్టర్ బాగా పనిచేస్తుందని వివరిస్తున్నారు.
అటు ఏపీలోనూ ఆదివారం ఫిష్ మార్కెట్లన్నీ సందడిగా మారుతున్నాయి. ఏలూరు చేపల మార్కెట్లో విచ్చలవిడిగా తిరుగుతున్న జనాలు కరోనాను వ్యాప్తి చేస్తున్నారు. చేపలు , మాంసం కోసం దుకాణాల దగ్గర భారీగా రద్దీ నెలకొంటోంది. భౌతిక దూరం పాటించమంటూ పోలీసులు మైకుల్లో ప్రచారం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో సామాన్య జనం ఆందోళన చెందుతున్నారు. కరోనా వచ్చి ఎంత డ్యామేజ్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎంతో మంది అయినవాళ్లను, ఆప్తులను కోల్పోయారు. రోజూ ఎన్నో కన్నీటి వ్యధలు వార్తా పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో చూస్తేనే ఉన్నారు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీతో పాటు తోటివాళ్ల జీవితాలు కూడా కాపాడండి.
Also Read: ఆ గ్రామంలో భయం భయం… పశువుల రక్తం తాగుతున్న సైకో.. తాజాగా లేగదూడను చంపి..