Telangana: ఆ గ్రామంలో భయం భయం… పశువుల రక్తం తాగుతున్న సైకో.. తాజాగా లేగదూడను చంపి..

మహబూబ్‌నగర్ జిల్లా సింగంపేటలో ఓ సైకో టెన్షన్ రేపుతున్నాడు. ఏకంగా  పశువుల రక్తం తాగుతూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. గతంలో  మేకలు, గొర్రెల గొంతు కోసి

Telangana: ఆ గ్రామంలో భయం భయం... పశువుల రక్తం తాగుతున్న సైకో.. తాజాగా లేగదూడను చంపి..
Drinking Animals Blood
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 04, 2021 | 1:16 PM

మహబూబ్‌నగర్ జిల్లా సింగంపేటలో ఓ సైకో టెన్షన్ రేపుతున్నాడు. ఏకంగా  పశువుల రక్తం తాగుతూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. గతంలో  మేకలు, గొర్రెల గొంతు కోసి రక్తం తాగుతున్న కమ్మరి రాజు అనే వ్యక్తిని గుర్తించి..  ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపించారు గ్రామస్తులు. 3నెలల చికిత్స తీసుకుని వచ్చిన అనంతరం అతడు మళ్లీ అదే పనికి పూనుకున్నాడు.  తాజాగా ఓ లేగదూడను చంపి రాజు రక్తం తాగాడు. ఆస్పత్రికి వెళ్లి వచ్చినప్పటి నుంచి అతడు 15 పశువులపై అటాక్ చేశాడని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పసిబిడ్డల ఉన్న కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. రాజును చూస్తేనే గ్రామస్తులు వణికిపోతున్నారు. అతడిని పిచ్చాసుపత్రికి పంపి మళ్లీ రాకుండా చూడాలని కోరుతున్నారు.

 గతంలో అమావాస్య అయితే ఆ గ్రామంలో భయం భయం.. తాజాగా అదే పరిస్థితి

కమ్మరి రాజు అనే వ్యక్తి వికృత చేష్టలు గ్రామస్తులను హడలెత్తిస్తున్నాయి. అమావాస్య వచ్చిందంటే చాలు రాత్రి సమయాల్లో తిరుగుతూ అర్ధరాత్రి వేళ గ్రామంలోని మేకలను గొర్రెలను ఎత్తుకెళ్లి, ఊరి శివార్లకు చేరుకొని అక్కడ వాటి గొంతు కొరికి చంపి రక్తం తాగుతుండడం స్థానికులను కలవరపెడుతుంది. దీంతో అమావాస్య వచ్చిందంటే చాలు గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పిచ్చాసుపత్రికి వెళ్లి వచ్చినా అతడి ప్రవర్తన మారకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా  జంతువులను తీసుకెళ్లి నోటితో కొరికి రక్తాన్ని తాగుతున్న ఆ వ్యక్తి మరుసటి రోజు ఉదయం అదే మేకపిల్లను భుజాన వేసుకొని గ్రామంలోకి వస్తుడటం గ్రామస్థుల్లో మరింత భయం రేపుతోంది.  తల్లిదండ్రులు రాజుకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉందేమో అని ఆసుపత్రిలో సైతం చూపించారు. కానీ డాక్టర్ ఎలాంటి వ్యాధి లేదని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక తల్లిదండ్రులు తలపట్టుకుంటున్నారు.

Also Read: షాకింగ్… రూ. 879కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్

 హైదరాబాద్‌ ఎస్‌బీఐ ఏటీఎంలో అంతు చిక్కని సమస్య.. ఈ పని సైబర్‌ నేరగాళ్లదేనా? ఇంతకీ ఏం జరిగిందంటే..