ATM: హైదరాబాద్‌ ఎస్‌బీఐ ఏటీఎంలో అంతు చిక్కని సమస్య.. ఈ పని సైబర్‌ నేరగాళ్లదేనా? ఇంతకీ ఏం జరిగిందంటే..

ATM: హైదరాబాద్‌ నగరంలో ఉన్న ఓ ఎస్‌బీఐ ఏటీఎంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఖాతాదారులు ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్నారు. కానీ డబ్బులు మాత్రం ఖాతాదారుల ఖాతాల్లో నుంచి కాకుండా బ్యాంకు మూలధనం నుంచి...

ATM: హైదరాబాద్‌ ఎస్‌బీఐ ఏటీఎంలో అంతు చిక్కని సమస్య.. ఈ పని సైబర్‌ నేరగాళ్లదేనా? ఇంతకీ ఏం జరిగిందంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 04, 2021 | 12:27 PM

ATM: హైదరాబాద్‌ నగరంలో ఉన్న ఓ ఎస్‌బీఐ ఏటీఎంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఖాతాదారులు ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్నారు. కానీ డబ్బులు మాత్రం ఖాతాదారుల ఖాతాల్లో నుంచి కాకుండా బ్యాంకు మూలధనం నుంచి డెబిట్ అవుతున్నాయి. దీంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా అవుతుండడంతో సమస్యను గుర్తించే పనిలో పడ్డారు. ఈ విచిత్ర సంఘటన నగరంలోని రాంనగర్‌ ఏటీఎంలో చోటు చేసుకుంది. బ్యాంకు మూల ధనం నుంచి దాదాపు రూ. 3.40 లక్షలు విత్‌డ్రా కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అలా జరగడానికి గల కారణమేంటో మాత్రం తెలియట్లేదు. మొదట సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా లోపం ఉందా అన్న కోణంలో పరీక్షించారు కానీ ఎలాంటి ఆధారాలు లభించలేవు. అయితే ఆ ఒక్క ఏటీఎం నుంచే అలా జరుగుతుండడంతో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఇది సైబర్‌ నేరగాళ్ల పనే అయి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Also Read: Telangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 151 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Laskar Bonal : ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించేందుకు .. ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి

Krishna Water: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ నిబంధనలు ఉల్లంఘిస్తోంది.. హైకోర్టు మెట్లెక్కిన కృష్ణా జిల్లా రైతు..