Laskar Bonal : ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించేందుకు .. ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి

Laskar Bonal : ఆషాఢమాసం వస్తుందంటే తెలంగాణలో బోనాల పండగ సందడి మొదలవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం భాగ్య నగరంలో బోనాల ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఆషాఢంలోని మూడో ఆదివారం..

Laskar Bonal : ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించేందుకు .. ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి
Laskar Bonal
Follow us

|

Updated on: Jul 04, 2021 | 11:51 AM

Laskar Bonal : ఆషాఢమాసం వస్తుందంటే తెలంగాణలో బోనాల పండగ సందడి మొదలవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం భాగ్య నగరంలో బోనాల ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఆషాఢంలోని మూడో ఆదివారం జరిగే లష్కర్ బోనాలు వెరీ వెరీ స్పెషల్. బోనమెత్తిన మహిళలు సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయానికి చేరుకుంటారు. భక్తి శ్రద్దలతో బోనం అమ్మవారికి సమర్పిస్తారు. కరోనా రాక ముందు వరకూ బోనాల పండగ అంటే ఎంతో సందడి ఉండేది.. భారీ సంఖ్యలో మహిళలు బోనం అమ్మవారికి స్వయంగా సమర్పించేవారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్వయంగా అమ్మవారికి బోనం సమర్పించే పరిస్థితులు లేవు. దీంతో ఉజ్జయిని ఆలయ నిర్వాహకులు సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఈ ఏడాది లష్కర్‌ బోనాలతో ఓ వినూత్న ప్రయోగంతో దేవాదాయ-పోస్టాఫీస్ శాఖ కలిపి సంయుక్తంగా భక్తుల ముందుకు రానున్నాయి.

బోనం సమర్పించాలనుకునే మహిళలు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని గోత్రనామాలు నమోదు చేస్తే వారి పేరు మీదుగా అమ్మవారికి ఆలయ అధికారులు బోనాన్ని సమర్పిస్తారు. అనంతరం బియ్యం పసుపు కుంకుమలను ప్రసాదంగా పోస్టు ద్వారా ఇంటికి పంపుతారు. వాటిని వండుకుని ప్రసాదంగా స్వీకరించొచ్చు. లాక్ డౌన్ ఎత్తేసినా ఇంకా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. జనం గుంపు గుంపులునా ఉండే పరిస్థితులు లేవు.. దీంతో ఇప్పటికే భద్రాద్రి రామయ్య కల్యాణానికి చేసినట్లు బోనాలకు ఆన్ లైన్ సదుపాయాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. బోనాలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా బోనం సమర్పించడానికి రూ.200 లను తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది.

బోనం సమర్పించాలనుకునే భక్తులు ఆ రుసుమును పోస్టాఫీసుల్లో చెల్లించి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంది. అనంతరం భక్తుల పేరుతో ఉజ్జయినీ మహంకాళీకి ఆలయ సిబ్బంది బోనం సమర్పించి అందులోని బియ్యం నుంచి 20 గ్రాములు, కుంకుమ, పొడి ప్రసాదాన్ని పోస్టు ద్వారా వారి ఇంటికి పంపుతారు. ఈ మేరకు దేవాదాయ శాఖ తపాల శాఖతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. వినాయక చవితికి కూడా ఆన్ లైన్ సేవలను తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తుంది.

Also Read: రన్నింగ్ స్కిప్పింగ్ ల్లో ఏది మంచిది .. ఏది ఎఫెక్టివ్ గా పనిచేస్తుందంటే..

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..