- Telugu News Photo Gallery Spiritual photos Goddess lakshmi devi will not stay with you if you reflect these characteristics
Goddess Lakshmi : లక్ష్మీదేవి నివాసం ఉండాలంటే.. పాటించాల్సిన నియమాలు.. చేయకూడని పనులు ఏమిటంటే
Lakshmi Devi : ఆర్ధిక సమస్యలు.. జీవితంపై అధికంగా ప్రభావం చూపిస్తుంటాయి. ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఏర్పడినప్పుడు జీవితం అయోమయంఅనిపిస్తుంది. అన్ని సమస్యలకంటే ఆర్ధిక సమస్యనే ఎక్కువగా కనిపించి బాధిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం ,ఆశీర్వాదం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు.
Updated on: Jul 04, 2021 | 2:16 PM

జీవితంలో ఆర్ధిక సమస్యలను తీర్చి అష్టైశ్వర్యాలను ఇచ్చేందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. సకల సంపదలకు అధినేత ఆ తల్లి అనుగ్రం సదా మనపై ఉండాలంటే ఆమెకు ఇష్టమైన రీతి లో నడుచుకోవాలి.

లక్ష్మీదేవి నివాస స్థానాలు పాలు, పూలు ,పసుపు ,కుంకుమ, దీపం,గోవు ,ధనం, ధాన్యం, పరిశ్రమైన ఇల్లు.. లక్ష్మీదేవి నివాసం ఉండే వీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఆగ్రహించి.. అక్కడ నుంచి వెళ్లిపోతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందుకనే ఎప్పుడూ భక్తి శ్రద్దలతో కొన్ని నియమాలతో వ్యవహరించవలసి ఉంటుంది.

సూర్యోదయం తర్వాత బారెడు పొద్దు ఎక్కిన తర్వాత నిద్ర లేచేవారి ఇంట్లో.. సాయంత్రపు వేళలో నిద్రించే వారి ఇళ్లలోను లక్ష్మీదేవి ఉండదు.

కష్టపడకుండా సోమరితనంతో బతికే వారింటిలో లక్ష్మి దేవి నివాసం ఏర్పరచుకోవడానికి ఇష్టపడదు. అటువంటి వారు ఉన్న ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తుంది.

సుఖ సంతోషాలతో ఉండే ఇంట్లో నివాసం ఉండదని లక్ష్మి దేవి ఇష్టపడుతుందట. ఎల్లప్పుడూ కలహాలతో వుండే ఇళ్లలోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా కాలు పెట్టదట. ఎక్కడైతే పవిత్రత .. ప్రశాంతత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని పురాణాల కథనం





























