- Telugu News Photo Gallery Spiritual photos These festivals in this week yogini ekadashi to ashadh amavasya 2021
Festivals In Week: ఈ వారంలో ఉన్న పండుగలు ఏంటో తెలుసా.. ఆషాడం అమావాస్య ఎప్పుడంటే..
మన హిందూ సంప్రదాయంలో ప్రతి రోజు... వారం ప్రత్యేకమైనవి. ఆదివారం దగ్గర్నుంచి.. శనివారం వరకు ప్రతి రోజూ ఎదో ఒక దేవుడిని ఆరాధిస్తుంటాం. అలాగే హిందూ సంప్రదాయంలో పండుగలు ఎక్కువే. నెలలో అనేక పండుగలు, ప్రత్యేకమైన రోజులు వస్తుంటాయి. మరీ ఈ వారంలో ఏ ఏ పండుగులున్నాయో తెలుసుకుందామా.
Updated on: Jul 05, 2021 | 1:58 PM

యోగిని ఏకాదశి.. (జూలై 5) జూలై 5న యోగిని ఏకాదశి. ఈరోజున విష్ణు మూర్తిని పూజించడమే కాకుండా.. ఉపవాసాలు ఉంటారు. ప్రతి నెలలో ఏకాదశులు వస్తుంటాయి. అందులో యోగిని ఏకాదశి ఒకటి.

ప్రదోష వ్రతం (జూలై 7) ప్రదోష వ్రతం అంటే.. ఆ రోజున శివుడిని పూజిస్తారు. అనంతరం ఉపవాస దీక్షను పాటిస్తారు. ఇక ఈ ఉపవాసాన్ని బుధవారం పాటిస్తే.. బుద్ ప్రదోష వ్రతం అంటారు. ఈరోజు ఉపవాసం చేస్తే మోక్షాన్ని పొందుతారట.

శివరాత్రి వ్రతం (జూలై 8) ప్రతి నెల కృష్ణ పక్షంలోని చతుర్థశి తిథిని నెలవారీ శివరాత్రి అంటారు. సంవత్సరంలో మొత్తం 12 శివరాత్రులు వస్తాయి. ఈ వారంలో గురువారం శివారత్రి ఉపవాసం వచ్చింది. ఈరోజున శివుడిని ఆరాధించి.. ఉపవాసం చేయడం వలన ఆనందం, శ్రేయస్సు సాధించవచ్చు.

ఆషాడ అమావాస్య (జూలై 9) ఆషాడ కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను శ్రాద్ అమావాస్యగా జరుపుకుంటారు. ఈ వారంలో శుక్రవారం ఆషాడ అమావాస్య వచ్చింది. ఈరోజు పితృకర్మలు చేస్తారు. పూర్వీకుల శాంతి కోసం పేదలకు ఆహారాన్ని దానం చేస్తారు.

ఈ వారంలో ఉన్న పండుగలు...





























