Revanth Reddy: ఆ కారణంగానే వైఎస్ఆర్ కేబినెట్‌లో పీజేఆర్‌కు చోటు దక్కలేదు.. కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..
Revanth Reddy: తెలంగాణ పీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు దివంగత నేత పీజేఆర్ తనయుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే..
Revanth Reddy: తెలంగాణ పీసీసీ కొత్త చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు దివంగత నేత పీజేఆర్ తనయుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని కలిశారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అంటే పీజేఆర్, పీజేఆర్ అంటే కాంగ్రెస్ అనే స్థాయికి ఎదిగారని కీర్తించారు. సీఎల్పీ నేతగా అప్పటి ప్రభుత్వాలను గడగడలాడించారని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు కృష్ణా జలాల కోసం పీజేఆర్ పోరాటం చేశారని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో నీటి సమస్య పరిష్కారం అయ్యిందంటే.. పీజేఆర్ వల్లే సాధ్యమైందన్నారు. బస్తీలలో ఇప్పటికీ పీజేఆర్ అంటే వల్లమాలిన ప్రేమ ఉందని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మొదట పోరాటం చేసింది పీజేఆర్ అని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఆయన తన పోరాటాన్ని సాగించారని పీజేఆర్ వ్యక్తిత్వాన్ని రేవంత్ రెడ్డి కొనియాడారు.
పీజేఆర్ చనిపోయిన తరువాత తెలంగాణ తరఫున బలంగా పోరాడే నేత లేకపోయారని అన్నారు. పీజేఆర్ చనిపోయిన తర్వాత.. ఆయన బిడ్డను ఏకగ్రీవం చేస్తానని మాట తప్పి.. అభ్యర్థిని పెట్టారని ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాల విషయంలో కొట్లాట వల్లే.. నాడు పీజేఆర్‌ను వైఎస్సార్ తన కేబినెట్ లోకి తీసుకోలేదన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తెలంగాణ పట్ల మరణ శాసనం అని ఆనాడే పీజేఆర్ చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పీజేఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే.. విష్ణువర్ధన్ రెడ్డికి అండగా నిలబడాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌లో ఏముందని దానం నాగేందర్ అంటున్నారని, ఆ కాంగ్రెస్ పార్టీనే ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిందని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు.. రద్దయిన వెయ్యి రూపాయల నోట్లు లాంటి వాళ్ళని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Also read:
Movie News: అసిస్టెంట్ డైరెక్టర్‌తో స్టార్ హీరో కుమార్తె, ప్రస్తుత హీరోయిన్ డేటింగ్ !
Saroj Khan: బాలీవుడ్లో బయోపిక్‌ల హంగామా.. తెరపైకి కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ జీవితకథ..