Saroj Khan: బాలీవుడ్లో బయోపిక్‌ల హంగామా.. తెరపైకి కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ జీవితకథ..
ప్రస్తుతం సినీ పరిశ్రమలో ప్రముఖుల జీవిత కథలను ఆధారంగా చేసుకోని చిత్రాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సావిత్రి వంటి అగ్రసినీ నటీనటుల జీవిత కథలను
ప్రస్తుతం సినీ పరిశ్రమలో ప్రముఖుల జీవిత కథలను ఆధారంగా చేసుకోని చిత్రాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సావిత్రి వంటి అగ్రసినీ నటీనటుల జీవిత కథలను తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించి సక్సెస్ అయ్యారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ జీవిత కథ వెండితెరకు రానుంది. గతేడాది సరోజ్ ఖాన్.. గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. శనివారం ఆమె తొలి వర్ధంతి సందర్భంగా.. నిర్మాత భూషణ్ కుమార్… ఆమె జీవిత కథను తెరకెక్కించబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా భుషణ్ కుమార్ మాట్లాడుతూ..” సరోజ్ ఖాన్.. తన డ్యాన్స్ స్టెప్పులతో హిందీ సినీ పరిశ్రమలో విప్లవాన్ని తీసుకువచ్చారు. ఆమె కంపోజ్ చేసిన స్టెప్పులలో తమ తమ అభిమాన తారల డ్యాన్స్ ను చూసేందుకు ఎంతో మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు. సరోజ్ ఖాన్ బయోపిక్ కు ఆమె కుమారుడు రాజు ఖాన్, సుఖైనా ఖాన్ సహకరిస్తున్నారని” అన్నారు.
“చిన్నప్పటి నుంచి సరోజ్ ఖాన్ ఎన్నో కష్టనష్టాలను చూసిన చూసిన ఆమె జీవితం.. ఓ స్పూర్తిదాయకం. నాన్నతో కలిసి సినిమా షూటింగ్స్ లకు వెళ్లినప్పుడు ఆమె స్టెప్పులను కంపోజ్ చేయడం చూసేవాడిని. ఆమె ఎంతో శ్రద్ధగా.. నిబద్ధదతో పనిచేసేవారు. ఆమె జీవిత కథను తెరకెక్కించడానికి అంగీకరించిన పిల్లలకు ధన్యవాదాలు” అని చెప్పారు భూషణ్ కుమార్.
అనంతరం సరోజ్ ఖాన్ కుమారుడు రాజు ఖాన్ మాట్లాడుతూ.. “మా అమ్మగారి బాటలోనే నేను కొరియోగ్రఫీ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడి ఉన్నత స్థానం సంపాదించో నాకు తెలుసు. అమ్మ బయోపిక్ తెరపైకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ” అన్నారు. సరోజ్ ఖాన్.. దాదాపు 3 వేల పాటలకు పైగా కొరియోగ్రఫీ చేశారు. అలాగే మూడు సార్లు జాతీయ అవార్డు సాధించారు.