AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi Tweet: అంతరిక్షయానం చేయనున్న తొలి తెలుగు మహిళపై ప్రశంసలు కురిపించిన చిరు.. అందరూ గర్వించదగ్గ విషయమంటూ..

Chiranjeevi Tweet: ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష.. అంతరిక్ష ప్రయాణం చేయనుందన్న వార్తలు యావత్‌ దేశాన్ని ఆకర్షించిన విషయం తెలిసిందే. తొలి తెలుగు మహిళ, రెండో భారతీయ మహిళగా పేరు సంపాదించుకున్న శిరీష..

Chiranjeevi Tweet: అంతరిక్షయానం చేయనున్న తొలి తెలుగు మహిళపై ప్రశంసలు కురిపించిన చిరు.. అందరూ గర్వించదగ్గ విషయమంటూ..
Chiru Tweet Bandla Sirisha
Narender Vaitla
|

Updated on: Jul 04, 2021 | 12:52 PM

Share

Chiranjeevi Tweet: ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష.. అంతరిక్ష ప్రయాణం చేయనుందన్న వార్తలు యావత్‌ దేశాన్ని ఆకర్షించిన విషయం తెలిసిందే. తొలి తెలుగు మహిళ, రెండో భారతీయ మహిళగా పేరు సంపాదించుకున్న శిరీష ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న శిరీష ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు దేశంలోని పలు భాషలకు చెందిన వారు శిరీషపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల బండ్ల గణేశ్‌ కూడా శిరీషకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేసిన విషయం విధితమే. ఇక తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా శిరీషకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరు ట్వీట్ చేస్తూ.. ‘అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు మహిళగా శిరీష అద్భుతమైన ఫీట్‌ను సాధించనుంది. ఇది ఆమె తల్లిదండ్రులు, తెలుగువారితో పాటు భారతీయులంతా గర్వపడే సమయం. ఈ మిషన్‌ విజయవంతమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ నెల 11వ తేదీన వాహక నౌక యూనిటీ-22 అంతరిక్షయానం చేయనున్న విషయం తెలిసిందే. ప్రైవేటు అంతరిక్షయాన సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రోన్సన్‌తో పాటు మరో ముగ్గురు అంతరిక్షంలో ప్రయాణించనున్నారు.

చిరు చేసిన ట్వీట్..

Also Read: Varun Tej and Naga Chaitanya: అక్కినేని-మెగా ఫ్యామిలీ యంగ్ హీరోల మల్టీస్టారర్.?

Megastar Chiranjeevi: చిరుకి చెల్లెలుగా ఆ స్టార్ హీరో సతీమణి.. గట్టిగా వినిపిస్తున్న గుసగుస..

David Warner: ‘వినయ విధేయ వార్నర్‌’.. ఈ సారి రామ్‌చరణ్‌ను వాడేసిన వార్నర్‌. వైరల్‌గా మారిన వీడియో..