David Warner: ‘వినయ విధేయ వార్నర్‌’.. ఈ సారి రామ్‌చరణ్‌ను వాడేసిన వార్నర్‌. వైరల్‌గా మారిన వీడియో..

David Warner: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఒకరు. పేరుకు ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడే అయినప్పటికీ వార్నర్‌కు భారతీయులతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. సోషల్‌ మీడియాలో..

David Warner: 'వినయ విధేయ వార్నర్‌'.. ఈ సారి రామ్‌చరణ్‌ను వాడేసిన వార్నర్‌. వైరల్‌గా మారిన వీడియో..
David Warner
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 04, 2021 | 11:02 AM

David Warner: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఒకరు. పేరుకు ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాడే అయినప్పటికీ వార్నర్‌కు భారతీయులతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. సోషల్‌ మీడియాలో తాను పోస్ట్‌ చేస్తోన్న వీడియోలే దీనికి నిదర్శనం. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌ సన్‌రైజర్స్‌ జట్టు తరఫున ఆడిన తర్వాత వార్నర్‌ తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. వార్నర్‌ చేసే స్వాపింగ్‌ వీడియోలు నెట్టింట సందడి చేస్తుంటాయి. ఈ ప్లేయర్‌ను పలానా హీరో వీడియోతో స్వాపింగ్‌ చేయమంటూ డిమాండ్‌లు కూడా వస్తున్నాయంటేనే వార్నర్‌కు ఉన్న క్రేజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే వార్నర్‌ ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాకు చెందిన చాలా మంది హీరోల వీడియోలను స్వాపింగ్‌ చేస్తూ నెట్టింట పోస్ట్ చేశాడు. ఇక తాజాగా మోగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ను కూడా వాడేసుకున్నాడు వార్నర్. ఈ సారి వినయ విధేయ రామలోని పవర్‌ ఫుల్‌ ఫైటింగ్‌ సీన్‌ను దించేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన వార్నర్‌.. ‘నేను మళ్లీ వచ్చేశాను. ఈ లెజెండ్‌ ఎవరు? ఇది ఏ సినిమాలో సన్నివేశం’ అని క్యాప్షన్‌ జోడించాడు. ఇక ఈ పోస్టుకు హీరోలు రామ్‌చరణ్‌, రానా దగ్గుబాటి, ప్రభాస్‌లను ట్యాగ్‌ చేయడం విశేషం.

వార్నర్‌ పోస్ట్‌ చేసిన వీడియో..

Also Read: Aamir khan: అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావ్‌ విడిపోవడానికి కారణం ఆ హీరోయినేనా..? నెట్టింట వైరల్‌గా మారిన హ్యాష్‌ ట్యాగ్‌.

Junior NTR : తారక్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్స్.. మెగాస్టార్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్..

Prabhas’s Adi Purush: తిరిగి సెట్స్ పైకి ఆదిపురుష్.. డార్లింగ్ ఎంట్రీ ఇచ్చేది అప్పుడేనా..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!