రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. కలెక్టరేట్‌ భవనం సహా పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవం

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Jul 04, 2021 | 3:59 PM

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ ప్రగతి పర్యటన చేస్తోన్న సీఎం కేసీఆర్, తనయుడు కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. కలెక్టరేట్‌ భవనం సహా పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవం
Cm Kcr

Follow us on

CM KCR Sircilla tour : రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ ప్రగతి పర్యటన చేస్తోన్న సీఎం కేసీఆర్, తనయుడు కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో ప‌లు అభివృద్ధి కార్యక్రమాల‌ను ప్రారంభించారు. సిరిసిల్లలో స‌క‌ల సౌక‌ర్యాల‌తో నిర్మించిన స‌మీకృత క‌లెక్టరేట్ భ‌వ‌నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం స‌ర్వమ‌త ప్రార్థన‌ల‌తో క‌లెక్టర్ కృష్ణభాస్కర్‌ కూర్చిలో ఆసీనుల‌య్యారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన, గృహప్రవేశాల కార్యక్రమంలో సైతం సీఎం పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు. అంత‌కు ముందు సీఎం కేసీఆర్ స‌ర్దాపూర్‌లో మార్కెట్‌యార్డును, సిరిసిల్లలో న‌ర్సింగ్ క‌ళాశాల‌ను, మండేప‌ల్లిలో ఐడీటీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.

Reada also : తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌ వివాదంలో బండి సంజయ్ రాజకీయాలు మానాలి : జగదీష్ రెడ్డి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu