AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: ఫుల్ ఖుషిగా అమీర్ దంపతులు.. కిరణ్ రావుతో కలిసి వీడియో షేర్ చేసిన మిస్టర్ ఫర్ఫెక్ట్.. మండిపడుతున్న నెటిజన్స్..

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం అమీర్ ఖాన్.. కిరణ్ రావు విడాకుల చర్చే నడుస్తుంది. కొత్త జీవితం ప్రారంభించడానికి... తామిద్దరం విడిపోతున్నామంటూ ప్రకటించి అందరికి షాకిచ్చారు

Aamir Khan: ఫుల్ ఖుషిగా అమీర్ దంపతులు.. కిరణ్ రావుతో కలిసి వీడియో షేర్ చేసిన మిస్టర్ ఫర్ఫెక్ట్.. మండిపడుతున్న నెటిజన్స్..
Amir Khan
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2021 | 5:46 PM

Share

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం అమీర్ ఖాన్.. కిరణ్ రావు విడాకుల చర్చే నడుస్తుంది. కొత్త జీవితం ప్రారంభించడానికి… తామిద్దరం విడిపోతున్నామంటూ ప్రకటించి అందరికి షాకిచ్చారు అమీర్ దంపతులు.. విడిపోయిన మేము కలిసే ఉంటామంటూ వారిద్దరు సంయుక్తంగా విడాకుల ప్రకటన చేయడంతో.. సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రకటనం అనంతరం అమీర్ ఖాన్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే దంగల్ నటి ఫాతిమా సనా షేక్‏తో అమీర్ రిలేషన్‏లో ఉన్నాడని.. అందుకే తన వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నాడనే ప్రచారం నెట్టింట్లో జోరుగా సాగుతుంది. రీల్ లైఫ్ డాటర్.. రియల్ లైఫ్ వైఫ్ గా మారబోతుందని కామెంట్స్ సోషల్ మీడియాలో హోరెత్తాయి. ఇదిలా ఉంటే.. ఆదివారం ఉదయం అమీర్, కిరణ్ రావులకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది..

ఓ ఛానల్‏కు ఇచ్చిన ఆన్‏లైన్ ఇంటర్వ్యూలో వీరిద్ధరు సంతోషంగా చేతిలో చెయ్యి వేసుకుని నవ్వుతూ కనిపించారు. ఆ వీడియోలో అమీర్, కిరణ్ రావు ఇద్దరు నవ్వుతూ మేము విడిపోవాలనుకున్నామి చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అమీర్ మాట్లాడుతూ.. కిరణ్ రావు చేతిని పట్టుకుని భార్య భర్తలుగా మేము విడిపోయిన ఒకరికి ఒకరం తోడుగా ఉంటామని.. తాము ఒకే కుటుంబమని చెప్పారు.

” మా విడాకుల ప్రకటన విని మీరంతా షాక్ అయ్యుండొచ్చు. ఈ వార్త మిమ్మల్ని బాధపెట్టి ఉండోచ్చు. కానీ మా నిర్ణయంతో మేమిద్ధం చాలా సంతోషంగా ఉన్నామని మీకు చెప్పాలనుకుంటున్నాము. విడాకులు తీసుకున్న కూడా మేము ఒకే కుటుంబంగా ఉంటాం. దీనివల్ల మా సంబంధంలోనే మార్పు వచ్చింది కానీ మేము ఎప్పటికీ ఒకరికి ఒకరం తోడుగా ఉంటాం” అంటూ చెప్పుకోచ్చాడు అమీర్. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ దైన శైలిలో అమీర్ తీరుపై విరుచకుపడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజా వీడియోలో అమీర్ చాలా సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నా.. కిరణ్ రావుది మాత్రం ఫేక్ స్మైలీ అని.. తన బాధను దాచిపెడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కిరణ్ రావు కంటే ముందు అమీర్ రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 16 ఏళ్ల బంధానికి స్వస్తి పలికి.. 2005లో వివాహం చేసుకున్నాడు.

ట్వీట్..

Also Read: Headache Relief Tips: భయంకరంగా వేధించే తలనొప్పిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. మైగ్రేన్ తగ్గించే బెస్ట్ టిప్స్.

Rakul Preet Singh: రకుల్‏కు సర్‏ఫ్రైజ్ గిఫ్ట్ పంపిన బాలీవుడ్ హీరో.. కానుకను సోషల్ మీడియాలో షేర్ చేసిన హీరోయిన్..