Shahid Kapoor: తెరపైకి మరోసారి విద్యాబాలన్-షాహిద్ కపూర్ లవ్‏స్టోరీ.. ఆ కామెంట్స్ వల్లే విడిపోయారంటూ..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ జంటలు ఎక్కువే.. వారి బ్రేకప్ స్టోరీలు కూడా ఎక్కువే. ఇద్దరూ స్టార్స్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చేలోపు.. బ్రేకప్ అంటూ టాక్ వినిపించేస్తుంది.

Shahid Kapoor: తెరపైకి మరోసారి విద్యాబాలన్-షాహిద్ కపూర్ లవ్‏స్టోరీ.. ఆ కామెంట్స్ వల్లే విడిపోయారంటూ..
Vidya Balan Shahid Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 05, 2021 | 7:07 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ జంటలు ఎక్కువే.. వారి బ్రేకప్ స్టోరీలు కూడా ఎక్కువే. ఇద్దరూ స్టార్స్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చేలోపు.. బ్రేకప్ అంటూ టాక్ వినిపించేస్తుంది. ఇలా ఇప్పటికే ఎన్నో జంటలు పెళ్లి పీటల వరకు వెళ్లి బ్రేకప్ చేప్పుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తెరపైకి మరోసారి బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్.. హీరోయిన్ విద్యా బాలన్ లవ్ స్టోరీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. షాహిద్ కపూర్‏ గర్ల ఫ్రెండ్స్ జాబితా కాస్తా పెద్దగానే ఉంటుంది. తనతో కలిసి పనిచేసిన ప్రతి హీరోయిన్‏తో షాహిద్ ప్రేమలో ఉన్నట్లుగా అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టేవి. అయితే కరీనా కపూర్ తో లవ్ స్టోరీ మినహా. మిగిలినవన్ని వదంతులుగానే ఉండిపోయాయి. అందులో విద్యా బాలన్ ప్యార్ కూడా ఒకటి. షాహిద్ కపూర్ ను విద్యా బాలన్ ఎంతో ప్రేమించిందట. కానీ కొన్ని సార్లు అతడి మాట తీరు వలన తీవ్రంగా బాధపడి అతడికి దూరమయ్యిందని బాలీవుడ్ సర్కిల్ టాక్.

విద్యాబాలన్, షాహిద్ కపూర్ కిస్మత్ కనెక్షన్ అనే సినిమా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. షూటింగ్ సమయంలో ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారట. ఇంకేముందు ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేసేసింది. అయితే కొద్దిరోజులు వీరిద్దరి ప్రేమ వ్యవహారం నడుస్తుండగానే.. ఆకస్మాత్తుగా బ్రేకప్ వార్తలు వినిపించాయి.. షాహిద్ ప్రవర్తన నచ్చకపోవడంతో…. విద్యా అతడికి బ్రేకప్ చేప్పినట్లుగా టాక్ వినిపించింది. ఎంత ప్రేమగా ఉన్నా.. షాహిద్ ప్రతిసారి విద్యా బాలన్ వెయిట్ గురించి అవహేళన చేసినట్లుగా మాట్లాడేవాడట. అయితే ఆ మాటలతో విద్యా బాలన్ కు చాలా బాధ కలిగించేవాట. అలా చాలా సార్లు షాహిద్ ఆమెను కించపరుస్తూ మాట్లాడం వలనే విద్యా అతడికి దూరం కావాలనుకుందట. తన రిలేషన్ షిప్ కంటే ఆత్మాభిమానం ముఖ్యమని ఆమె షాహిద్ కు బ్రేకప్ చేప్పిందట.

అయితే విద్యా బాలన్ బ్రేకప్ చెప్పడం షాహిద్ చాలా లైట్ గా తీసుకున్నాడట. అయితే విద్యా బాలన్ మాత్రం ప్రతి ఇంటర్వ్యూలో ప్రేమ.. బ్రేకప్ గురించి అడిగినప్పుడు విసిగిపోయా అని.. ప్రేమ కంటే ఆత్మాభిమానం ముఖ్యమని చెప్పుకోచ్చిందట. ఇక షాహిద్ కపూర్ ఏ ఒక్క రిలేషన్ లో కూడా సీరియస్ గా లేడట. అతడి ప్రవర్తన, తొందరపాటు తనం వలన ప్రతి అమ్మాయి అతడికి దూరమయ్యేదని.. బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల టాక్.

Also Read: Kajal Aggarwal: నాగార్జున సినిమాలో కాజల్ పాత్ర అలా ఉండబోతుందా ? ఛాలెంజింగ్ రోల్‏లో చందమామ..

Bhavya Bishnoi: పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న హీరోయిన్.. కారణమదేనంటూ నెటిజన్ల ట్రోల్.. వార్నింగ్ ఇచ్చిన భవ్య బిష్ణోయ్..

ఆ దర్శకుడికి కోరుకున్నది ఇస్తే లక్ష రూపాయాలిస్తారట.. వెంటనే బిల్డింగ్ మీద నుంచి… షాకింగ్ విషయాలను చెప్పిన హీరోయిన్..