5

Ayurvedic Herb Brahmi : ఆయుర్వేదంలో అద్భుత ఔషది ఈ ఆకు.. జ్ఞాపక శక్తితో ఇబ్బంది పడుతున్నవారు ఈ ఆకుని ట్రై చేయండి..

Ayurvedic Herb Brahmi: పిల్లల్లో తెలివి తేటలు , జ్ఞాపక శక్తి పెరగాలన్నా మన పెద్దలు బ్రహ్మి ఆకుని ఉపయోగించేవారు. దీనిని వాడుక భాషలో సరస్వతి ఆకు అని అంటాం.. ఇది గొప్ప ఆయుర్వేద..

Ayurvedic Herb Brahmi : ఆయుర్వేదంలో అద్భుత ఔషది ఈ ఆకు.. జ్ఞాపక శక్తితో ఇబ్బంది పడుతున్నవారు ఈ ఆకుని ట్రై చేయండి..
Ayurvedic Herb Brahmi
Follow us

|

Updated on: Jul 04, 2021 | 12:30 PM

Ayurvedic Herb Brahmi: పిల్లల్లో తెలివి తేటలు , జ్ఞాపక శక్తి పెరగాలన్నా మన పెద్దలు బ్రహ్మి ఆకుని ఉపయోగించేవారు. దీనిని వాడుక భాషలో సరస్వతి ఆకు అని అంటాం.. ఇది గొప్ప ఆయుర్వేద ఔషధ మూలిక.. ఈ ఆకు పొడిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం వలన అద్భుత ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆలోచనా శక్తి పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ప్రస్తుతం అన్ని ఆయుర్వేద షాపుల్లో ఇది పొడి, టాబ్లెట్స్, లేహ్యం, తైలం. ఇలా నేక రూపాల్లో లభిస్తుంది. ఈ బ్రహ్మి ఆకు చిన్న మెదడుకు ఆధారమైన సెరెబెల్లమ్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఆకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం

*ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య మానసిక ఒత్తిడి. దీనికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒత్తిడి ప్రతిస్పందనతో సంబంధం ఉన్న హార్మోన్లను నియంత్రింస్తుంది, దీంతో మానసిక ప్రశాంతతను చేకూర్చుతుంది. * అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను తగ్గించడానికి ఇది దివ్య ఔషధం *మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్రహ్మి ఆకుల్లో బాకోసైడ్లు అని పిలువబడే బయో కెమికల్ ఉంటాయి. ఇవి మెదడు కణాలను ప్రభావితం చేస్తాయి.. దీంతో మెదడు కణజాలాలను తిరిగి నిర్మించడంలో సహాయపడుతుంది. *ఇది తెలివితేటలు, ఏకాగ్రత , జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడులోని హిప్పోకాంపస్ భాగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఏకాగ్రత , జ్ఞాపకశక్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది. *ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లతో ఇది నిండి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు కాన్సర్ ను అభివృద్ధి చేసే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. *ఆర్థరైటిస్, గౌట్, ఇతర తాపజనక పరిస్థితుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. *గ్యాస్ట్రిక్ అల్సర్లను తగ్గించడానికి, ప్రేగు సిండ్రోమ్ చికిత్సకు అత్యంత ఉపయోగపడే ఔషధం *షుగర్ వ్యాధి గ్రస్థులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. * జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయ పడుతుంది. *సరస్వతి తైలం చర్మ కణాల పునరుత్పత్తిని ప్రేరేపించడం ద్వారా చర్మం రంగును పెంచుతాయి.

Also Read: ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించేందుకు .. ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి

మీరూ గోల్డ్ మెడల్ గెలవండి: పురుషుల జట్టుకు రోడ్రిగ్స్ సందేశం..
మీరూ గోల్డ్ మెడల్ గెలవండి: పురుషుల జట్టుకు రోడ్రిగ్స్ సందేశం..
భారత్‌పై స్వరం మార్చిన అమెరికా.. దర్యాప్తుకు సహకరించాలని అభ్యర్థన
భారత్‌పై స్వరం మార్చిన అమెరికా.. దర్యాప్తుకు సహకరించాలని అభ్యర్థన
ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. కనీసం 5 కోట్ల మందిని చంపుతుంది!
ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. కనీసం 5 కోట్ల మందిని చంపుతుంది!
మీకు మద్యం సేవించే అలవాటు ఉందా.? మీ పిల్లలో...
మీకు మద్యం సేవించే అలవాటు ఉందా.? మీ పిల్లలో...
అరదశాబ్ధం కింద ఆగిపోయిన విక్రమ్‌ సినిమాలకు రెక్కలు..
అరదశాబ్ధం కింద ఆగిపోయిన విక్రమ్‌ సినిమాలకు రెక్కలు..
సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టనున్న శ్రీలీల.. ఆ స్టార్ హీరోకి జోడిగా
సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టనున్న శ్రీలీల.. ఆ స్టార్ హీరోకి జోడిగా
చంద్రబాబు అరెస్టుపై స్పందించిన కేటీఆర్.. ఏం అన్నారంటే ?
చంద్రబాబు అరెస్టుపై స్పందించిన కేటీఆర్.. ఏం అన్నారంటే ?
రతిక దెబ్బకు రైతు బిడ్డ షాక్.. సుబ్బును ఏడిపించిన అమర్..
రతిక దెబ్బకు రైతు బిడ్డ షాక్.. సుబ్బును ఏడిపించిన అమర్..
ధావన్‌, రాహుల్, కోహ్లీ రికార్డులు బ్రేక్.. అగ్రస్థానంలో గిల్..
ధావన్‌, రాహుల్, కోహ్లీ రికార్డులు బ్రేక్.. అగ్రస్థానంలో గిల్..
చిరంజీవికి సర్జరీ.. శంకరపల్లిలో కల్కితో నాగ్ అశ్విన్ బిజీ..
చిరంజీవికి సర్జరీ.. శంకరపల్లిలో కల్కితో నాగ్ అశ్విన్ బిజీ..