Banana Health Benefits: ప్రతిరోజూ రెండు అరటిపండ్లు తింటే.. ఆ రోగాలన్నింటికీ చెక్ పెట్టొచ్చు తెలుసా..? అవేంటంటే..
Health Benefits of Banana: పండ్లల్లో అనేక పోషకాలు దాగుంటాయి. అందుకే చాలామంది పండ్లను తినేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి పండ్లల్లో సామాన్యుల ఫలం.. అరటిపండు..
Health Benefits of Banana: పండ్లల్లో అనేక పోషకాలు దాగుంటాయి. అందుకే చాలామంది పండ్లను తినేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి పండ్లల్లో సామాన్యుల ఫలం.. అరటి పండు. ఎందుకంటే.. ఇవి సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. దీనిని ప్రతిఒక్కరూ ఇష్టంగా తింటారు. ఎందుకంటే.. దీనిలో అనేక పోషకాలున్నాయి. అయితే.. అలాంటి అరటి రోజు ఆహారంలో తీసుకుంటే సర్వరోగాల నివారణ సాధ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మన శరీరానికి తగినన్ని పోషకాలు అందాలంటే ప్రతిరోజు రెండు అరటి పండ్లు తప్పనసరిగా తినాలని సూచిస్తున్నారు. ఇవి నిత్యం తింటే.. జబ్బుల బారిన పడినవారు తొందరగా కోలుకుంటారు. అందుకే ప్రతిఒక్కరూ అరటిని తినాలని సూచిస్తుంటారు. అరటి పండు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటిపండు ఆరోగ్య ప్రయోజనాలు.. ➼ అరటి పండు శరీర కండరాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్త కణాలను అరటి అభివృద్ధి చేస్తుంది. ➼ జీర్ణ సంబంధ సమస్యలకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. ➼ అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు, గుండెకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు. ➼ అరటిని ఏ రూపంలో తీసుకున్నా.. రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది. ➼ కంటికి సంబంధించిన వ్యాధులు, గ్యాస్ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను అరకట్టడంలో అరటిపండు కీలకంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ➼ ఫైబర్ ఎక్కువగా ఉండి మలబద్దకం, ఉదర సమస్యలు త్వరగా తగ్గుతాయి. ➼ అరటిలో విటమిన్-బీ పుష్కలంగా లభిస్తుంది. చిన్న పిల్లలకు రోజూ తినిపిస్తే.. శరీరంలోని ఖనిజాల లోపం ఏర్పడదు. ➼ రే చీకటి వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా అరటి పండు తింటే.. ఈ వ్యాధి నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. ➼ అందుకే ప్రతిరోజూ రెండు అరటి పండ్లను క్రమం తప్పకుండా తినాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
Also Read: