AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudeer Babu: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో చర్చ… సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై హీరో సుధీర్ బాబు ట్వీట్..

కేంద్రం తీసుకువస్తున్న సినిమాటోగ్రఫీ బిల్లుపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

Sudeer Babu: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో చర్చ... సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై హీరో సుధీర్ బాబు ట్వీట్..
Sudheer Babu
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2021 | 3:13 PM

Share

కేంద్రం తీసుకువస్తున్న సినిమాటోగ్రఫీ బిల్లుపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కమల్ హాసన్, సూర్య, గౌతమ్ మీనన్, పిసి శ్రీరామ్ వంటి ప్రముఖులు బిల్లు వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయితే ఈ సినిమాటోగ్రఫీ బిల్లుపై ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి ఆర్జీవి మినహా ఏ ఒక్కరు స్పందించకపోవడం గమనార్హం. దీంతో టాలీవుడ్ నటీనటులపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో సుధీర్ బాబు ఒక అడుగు ముందుకు వేసి.. సినిమాటోగ్రఫీ బిల్లుపై స్పందించారు.

” ఇప్పటికే సినిమాను టార్గెట్ చేయడం సులభంగా మారింది. ఇప్పుడు #సినిమాటోగ్రఫి బిల్ల్ కూడా దానిని మరింత సులభతరం చేస్తుంది. భావ ప్రకటన, స్వేచ్ఛా అనే రాజ్యాంగ హక్కును మనం కోల్పోకూడదు. మాకు భయం కలిగించే వాతావరణం అవసరం లేదు. రీ సెన్సార్ అనే ఆలోచన ఉంటే సీబీఎఫ్సీ ఉండడం వలన ఉపయోగం ఏంటీ ?” అని ట్వీట్ చేశారు సుధీర్ బాబు. అయితే ఇప్పటివరకు కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుపై నోరు మెదపని.. టాలీవుడ్ ప్రముఖులు ఇకనైనా తమ గళం విప్పుతారా ? లేదా అనేది చూడాలి. అటు బాలీవుడ్ నుండి అనురాగ్ కశ్యప్, హన్సాల్ మెహతా, ఫర్హాన్ అక్తర్, షబానా అజ్మీ, దిబాకర్ బెనర్జీతో మరికొందరు ఈ బిల్లు అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరుతూ బహిరంగంగా లేఖ రాశారు.

ట్వీట్..

Also Read: Vanitha Vijay Kumar: సీనియర్ హీరోయిన్ పై విరుచుకుపడ్డ వివాదాల వనితా.. ఈసారి ఏమన్నదంటే…

Aamir Khan-Kiran Rao : అమీర్ విడాకుల పై ఆర్జీవీ ట్వీట్… వర్మ సినిమాకు స్టోరీ దొరికిందంటున్న నెటిజన్లు