జైలులో మగ ఖైదీలకు చుక్కలు చూపించిన మహిళా అధికారిణి.. మరీ ఇంత దారుణమా..?
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మహిళా జైలు అధికారిణికి తగిన శాస్తి జరిగింది. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్ల పాటు ఆమె కామ దాహానికి బలైన బాధితులు ఎందరో ఉన్నారు...
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మహిళా జైలు అధికారిణికి తగిన శాస్తి జరిగింది. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్ల పాటు ఆమె కామ దాహానికి బలైన బాధితులు ఎందరో ఉన్నారు. అవును మీరు విన్నది నిజమే… తెలిసో, తెలియకనో తప్పులు చేసి జైళ్లో ఊచలు లెక్కబెడుతున్న ఖైదీలకు చుక్కలు చూపించింది కాలిఫోర్నియాకు చెందిన గోన్‌జలెజ్ అనే మహిళా జైలు అధికారిణి. ఫ్రెస్నో కౌంటీ జైలులో మగ ఖైదీల పర్యవేక్షణ అధికారిణిగా ఆమె పనిచేస్తోంది. గత మూడేళ్ల పాటు గోన్‌జలెజ్ అక్కడే విధులు నిర్వర్తిస్తోంది. అయితే జైలులో శిక్షను అనుభవిస్తున్న మగ ఖైదీలపై ఆమె లైంగిక వేధింపులకు పాల్పడేది. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాలని, ఆమె ఖైదీలను బెదిరించేది. ఇక రోజురోజుకు పెట్రేగిపోతున్న ఆమె కామ వంచనను తట్టులేక ఖైదీలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసి.. గత మే నెలలోనే అరెస్ట్ కూడా చేశారు పోలీసులు.
ఇక కోర్టులో పలువురు బాధితుల నుంచి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి, నిందుతురాలిని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కామ వాంఛల్నీ తీర్చేందుకు, ఆమె పెట్టే టార్చర్ ఏవిధంగా ఉంటుదన్న విషయాన్ని స్టేట్‌మెంట్‌గా రికార్డు చేసి, జడ్జి ముందు ఉంచారు. ఇక ఆ అకృత్యాల రిపోర్ట్‌ను చూసి జడ్జి సైతం షాక్ అయ్యాడు. అంతేకాదు.. ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు.. మిగతా ఖైదీలు కన్నార్పకుండా చూడాలని కండిషన్ పెట్టేదని, స్టేట్‌మెంట్‌లో చెప్పుకొచ్చారు బాధితులు. అయితే గోన్‌జలెస్ వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగిసిందన్న.. బాధలోనే ఆమె అలా ప్రవర్తించిందని తెలిపాడు నిందితురాలి తరపున కౌన్సెలర్. కానీ జడ్జి మాత్రం, ఆ కౌన్స్‌లర్ కామెంట్స్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెకు శిక్షను ఖరారు చేసేశాడు. బాధ్యాతాయుతమైన పోస్ట్‌లో ఉండి, ఇంతటి దారుణలకు పాల్పడ్డ గోన్‌జలెస్‌ను.. ఓ కామ పిశాచిగా వర్ణించాడు జడ్జి. నీ జీవితాన్ని ‘నీ చేతులారా నాశనం చేసుకున్నావ్’.. అంటూ ఆమెకు మూడేళ్ల ఎనిమిది నెలల జైలు శిక్షను విధించాడు. అయితే ఏ జైలులో అయితే ఆమె అకృత్యాలకు పాల్పడిందో అదే జైలుకి ఇప్పుడామె ఖైదీగా పంపించారు జడ్జి. ఇకపై అయిన సరిగ్గా ఉండాలంటూ హెచ్చరించాడు.
Also Read: “ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం.. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం”