‘చోర్ కీ దాడీ’..రఫెల్ విమానాల డీల్ పై ప్రధాని మోదీమీద ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

Umakanth Rao

Umakanth Rao | Edited By: Phani CH

Updated on: Jul 04, 2021 | 1:10 PM

రఫెల్ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదంలో ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..'చోర్ కీ దాడీ' అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ క్యాప్షన్ తో ఓ ఇమేజ్ ని పోస్ట్ చేశారు.

'చోర్ కీ దాడీ'..రఫెల్ విమానాల డీల్ పై ప్రధాని మోదీమీద ధ్వజమెత్తిన  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
Rahul Gandhi Took To Social Media To Hit Out At Prime Minister Narendra Modi

రఫెల్ విమానాల కొనుగోలు ఒప్పంద వివాదంలో ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..’చోర్ కీ దాడీ’ అంటూ తీవ్రంగా విమర్శించారు. ఈ క్యాప్షన్ తో ఓ ఇమేజ్ ని పోస్ట్ చేశారు.రఫెల్ విమానాల డీల్ లో అవినీతి జరిగిందని, దీనిపై దర్యాప్తు జరపాలని ఫ్రాన్స్ జడ్జి ఒకరు అక్కడి ప్రాసిక్యూటర్ల కార్యాలయాన్ని ఆదేశించారు. ఈ ప్లేన్ల కొనుగోలుకు సంబంధించి 2016 లో భారత ప్రభుత్వానికి, ఫ్రెంచ్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ సంస్థ దసాల్ట్ కి మధ్య 7.8 బిలియన్ యూరోల మేర ఒప్పందం కుదిరింది. అయితే ఇందులో అవకతవకలు జరిగాయని, సొమ్ములు చేతులు మారాయని, కొందరు భారతీయ అధికారులకు కూడా ముడుపులు ముట్టాయని ఫ్రాన్స్ లోని ఓ వెబ్ సైట్ ఆరోపించింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న జడ్జి దీనిపై విచారణకు ఆదేశించారు. ఇక ఈ కాంట్రాక్టు వ్యవహారంపై ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యతను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ డీల్ లో అవినీతి జరిగినట్టు తాము ఇదివరకే ఆరోపించామని పార్టీ పేర్కొంది.

తమ యూపీఏ హయాంలో కుదుర్చుకున్న ధర కన్నా కావాలనే ఎక్కువగా ధర కోట్ చేశారని పైగా ఇందులో ఆశ్రిత పక్షపాతం చోటు చేసుకుందని విమర్శించింది. అనిల్ అంబానీ నేతృత్వం లోని రిలయెన్స్ గ్రూప్ ని మోదీ ప్రభుత్వం దసాల్ట్ సంస్థకు భాగస్వామిని చేసిందని.. అసలు ఈ సంస్థకు ఈ విధమైన వ్యవహారాల్లో అనుభవం లేదని కూడా కాంగ్రెస్ తప్పు పట్టింది. 36 రఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసును తాము విచారించలేమని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిన విషయం గమనార్హం.

View this post on Instagram

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

మరిన్ని ఇక్కడ చూడండి: అసదుద్దీన్ ఒవైసీ సవాలును స్వీకరిస్తున్నాం.. 300 సీట్లు గెలుస్తాం…యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..

Crime News: షాకింగ్… రూ. 879కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu