రెజ్లింగ్ మ్యాచ్ లు చూస్తా….నాకు టీవీ కావాలి…తీహార్ జైలు అధికారులకు రెజ్లర్ సుశీల్ కుమార్ లేఖ
వినోద కాలక్షేపం కోసం తనకు టీవీ కావాలని రెజ్లర్ సుశీల్ కుమార్ తీహార్ జైలు అధికారులను కోరాడు. పైగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రెజ్లింగ్ మ్యాచ్ లకు సంబంధించిన అన్ని అప్ డేట్స్ ను నేను చూడాల్సి ఉందని..
వినోద కాలక్షేపం కోసం తనకు టీవీ కావాలని రెజ్లర్ సుశీల్ కుమార్ తీహార్ జైలు అధికారులను కోరాడు. పైగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రెజ్లింగ్ మ్యాచ్ లకు సంబంధించిన అన్ని అప్ డేట్స్ ను నేను చూడాల్సి ఉందని.. అందువల్ల ఈ సౌకర్యం ఏర్పాటు చేయాలనీ వారికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశాడు. యువ రెజ్లర్ సాగర్ ధన్ కర్ కిడ్నాప్, హత్య కేసులో నిందితునిగా ఉన్న సుశీల్ కుమార్ జ్యూడిషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 9 వరకు పొడిగించింది. ఇతడిని, ఇతడి సహచరుడు అజయ్ బకర్ వాలాను ఢిల్లీ పోలీసులు గత మే 23 న అరెస్టు చేశారు. సాగర్ అందరి ఎదుట తనను దూషించాడన్న కోపంతో సుశీల్ కుమార్ తన సహచరులతో కలిసి అతనిపై దాడి చేశాడు. పైగా దీన్ని వీడియో తీయాలని తద్వారా తనంటే అందరూ భయపడతారని ప్రిన్స్ అనే తన స్నేహితుడిని అప్పట్లో కోరాడు. ఆ ఎటాక్ లో తీవ్రంగా గాయపడిన సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అరెస్టుకు ముందు సుశీల్ కుమార్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన మరునాడు హరిద్వార్ పారిపోయాడు. అక్కడ తనకు తెలిసిన ఓ బాబా దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడు. చివరకు చేతిలో డబ్బులు లేకపోవడంతో మళ్ళీ ఢిల్లీకి వచ్చి ఓ వ్యక్తి దగ్గరకు స్కూటర్ పై వెళ్తూ పోలీసులకు పట్టు బడ్డాడు.
ఢిల్లీ కోర్టులో ఇతడిని పోలీసులు ప్రవేశపెట్టినప్పుడు తనకు స్పెషల్ ఫుడ్ కావాలని కోరగా కోర్టు అందుకు తిరస్కరించింది. అందరు ఖైదీలకు మాదిరే నీకు కూడా డైట్ ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్న సుశీల్ తనకు టీవీ అవసరమని అంటున్నాడు. మరి ఇతని కోర్కెను అధికారులు అంగీకరిస్టారో లేదో చూడాలి.
మరిన్ని ఇక్కడ చూడండి: Dimple Hayathi: బాలీవుడ్‌లోకి డింపుల్ హయాతి ?… వరుస ఆఫర్లతో ‘ఖిలాడి’ హీరోయిన్ బిజీ..
అమరావతి భూకుంభకోణం వెనుక మాస్టర్‌మైండ్ ఇతడే.. వీడియో రిలీజ్ చేసిన మంగళగిరి ఎమ్మెల్యే