కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలు డీల్ లో అవినీతి ..? బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో పై విచారణకు సుప్రీంకోర్టు అనుమతి

భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలు డీల్ లో అవినీతి జరిగిందని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై విచారణకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతించింది.

కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలు  డీల్ లో అవినీతి ..? బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో పై విచారణకు సుప్రీంకోర్టు అనుమతి
Jair Bolsonaro
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 04, 2021 | 1:14 PM

భారత్ బయోటెక్ వారి కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలు డీల్ లో అవినీతి జరిగిందని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనపై విచారణకు ఆ దేశ సుప్రీంకోర్టు అనుమతించింది. ప్రాసిక్యూటర్ల కార్యాలయం దీనిపై విచారణ జరపాలని జస్టిస్ రోసా వెబర్ ఆదేశించారు. 20 మిలియన్ డోసుల కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలుకు 316 మిలియన్ డాలర్లు వ్యయమయ్యే కాంట్రాక్టు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని… ఇందుకు అధ్యక్షుడు బాధ్యుడని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. నిర్దేశించిన ధర కన్నా ఈయన ఎక్కువ ధర కోట్ చేసినట్టు బ్రెజిల్ సెనేట్ కమిషన్ కూడా అనుమానించింది. ఈ డీల్ లో అవినీతి జరిగినట్టు జైర్ బోల్సనారో కి ముందే తెలిసినా ఇన్వెస్టిగేషన్ కి ఆదేశించలేదని ఈ కమిషన్ పేర్కొంది. దీంతో ఈ కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసింది. బ్రెజిల్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు, కంప్ట్రోలర్ జనరల్ కార్యాలయం కూడా వేర్వేరుగా దర్యాప్తు ప్రారంభించాయి. ఈ అవినీతి వ్యవహారంలో కాంగ్రెస్ దిగువ సభలో ప్రభుత్వ చీఫ్ విప్ రికార్డో బారోస్ పాత్ర కూడా ఉన్నట్టు వెల్లడైంది. అయితే అటు ఈయన.. ఇటు జైర్ కూడా ఈ కాంట్రాక్టు విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని, తమకు ఏ విధమైన సంబంధం లేదంటూ తోసి పుచ్చారు.

ఈ కేసుకు సంబంధించి అధికారులు సాక్ష్యాధారాలను సమర్పించేందుకు సుప్రీంకోర్టు 90 రోజుల వ్యవధినిచ్చింది. జైర్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలితే ఆయనపై కోర్టు ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి.. అటు భారత్ బయోటెక్.. తమ వైపు నుంచి ఏ తప్పిదం జరగలేదని.. తాము ఒకదాని తరువాత ఒకటిగా అన్ని లాంఛనాలను పూర్తి చేశామని స్పష్టం చేసింది. ఈ కాంట్రాక్టు అంశంలో తాము అన్నింటినీ సక్రమంగా నెరవేర్చామని బ్రెజిల్ నుంచి తమకు అద్వాన్సుగా సొమ్ము ముట్టలేదని కూడా పేర్కొంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Aamir khan: అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావ్‌ విడిపోవడానికి కారణం ఆ హీరోయినేనా..? నెట్టింట వైరల్‌గా మారిన హ్యాష్‌ ట్యాగ్‌.

Vaccine Auto: వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ వినూత్న ప్రచారం.. ఆకట్టుకుంటున్న ‘వ్యాక్సిన్ ఆటో’.. వైరల్ వీడియో