బ్రెజిల్ అధ్యక్షునికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలు.. పలు చోట్ల ర్యాలీలు.. అభిశంసించాలంటూ నినాదాలు
బ్రెజిల్ లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలులో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు జైర్ బోల్సనారో కి వ్యతిరేకంగా ప్రజల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
బ్రెజిల్ లో కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలులో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు జైర్ బోల్సనారో కి వ్యతిరేకంగా ప్రజల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనేక చోట్ల పెద్ద సంఖ్యలో వారు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే 5 లక్షమంది కోవిద్ రోగుల మృతికి కారణమైందని.. ఈ ప్రభుత్వ అనుమానాస్పద నిర్ణయాలు , ఫేక్ న్యూస్, తో దీని ప్రతిష్ట దిగజారిందని ప్రొటెస్టర్లు ఆరోపించారు. ఇప్పుడు వ్యాక్సిన్ కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలను అధ్యక్షుడు ఎదుర్కొంటున్నారని నిరసనకారుల్లో ఒకరైన ఓ డాక్టర్ వ్యాఖ్యానించారు. జీనో సైడల్ బోల్సనారో, ఇంపీచ్ మెంట్ ఆల్రెడీ, అని స్లొగన్స్ ఇచ్చిన నిరసనకారులు..వెంటనే వ్యాక్సిన్లను ప్రభుత్వం అనుమతించాలని డిమాండ్ చేశారు. వరుసగా మూడో రోజు కూడా సావో పాలో, రియో డీ జెనీరో, వంటి నగరాల్లో..చేత ప్లకార్డులు పట్టుకుని వీరు వీధుల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
జైర్ బోల్సనారో మీద వచ్చిన ఆరోపణల[పై దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ప్రాసిక్యూటర్ల కార్యాలయాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో సెనేట్ కమిషన్ కూడా వీటిపై విచారణ ప్రారంభించింది. ఈ విచారణ త్వరగా పూర్తి కావాలని ప్రొటెస్టర్లు కోరుతున్నారు. కాగా ఈ డీల్ లో ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తనకు లంచం ఇవ్వజూపారని ఓ బిజినెస్ మన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రాసిక్యూటర్లు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇంత జరుగుతున్నా ఈ డీల్ లో ఎలాంటి అవినీతి జరగలేదని… తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారాలని జైర్ అంటున్నారు. వీటిని ఆయన తేలిగ్గా కొట్టి పారేశారు. అటు-ఈయనపై ఆరోపణలతో కూడిన ఇంపీచ్ మెంట్ రిక్వెస్ట్ ని ప్రతిపక్షాలు ఈ వారం పార్లమెంటుకు సమర్పించాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Ayurvedic Herb Brahmi : ఆయుర్వేదంలో అద్భుత ఔషది ఈ ఆకు.. జ్ఞాపక శక్తితో ఇబ్బంది పడుతున్నవారు ఈ ఆకుని ట్రై చేయండి..
Varun Tej and Naga Chaitanya: అక్కినేని-మెగా ఫ్యామిలీ యంగ్ హీరోల మల్టీస్టారర్.?