ఆర్బిటల్ స్టేషన్ బయట మొదటిసారిగా స్పేస్ వాక్ చేసిన ఇద్దరు చైనా వ్యోమగాములు.. ఎందుకంటే ..?

ఆర్బిటల్ స్టేషన్ బయట మొదటిసారిగా స్పేస్ వాక్ చేసిన ఇద్దరు చైనా వ్యోమగాములు.. ఎందుకంటే ..?
New Space Station Make Spacewalk

ఇద్దరు చైనా వ్యోమగాములు మొట్టమొదటిసారిగా తమ దేశ కొత్త ఆర్బిటల్ స్టేషన్ బయట స్పేస్ వాక్ చేశారు. 15 మీటర్ల పొడవైన రోబోటిక్ ఆమ్ (చేతిని) అమర్చేందుకు వారు బయట ఈ వాక్ చేయడం విశేషం.

Umakanth Rao

| Edited By: Phani CH

Jul 04, 2021 | 4:03 PM

ఇద్దరు చైనా వ్యోమగాములు మొట్టమొదటిసారిగా తమ దేశ కొత్త ఆర్బిటల్ స్టేషన్ బయట స్పేస్ వాక్ చేశారు. 15 మీటర్ల పొడవైన రోబోటిక్ ఆమ్ (చేతిని) అమర్చేందుకు వారు బయట ఈ వాక్ చేయడం విశేషం. ల్యూ బూమింగ్, టాంగ్ హాంగ్ బో అనే వీరు బయట నడుస్తుండగా కక్ష్య లోపల కమాండర్ నీ హైషింగ్ వీరి కదలికలను పర్యవేక్షించాడు. మూడు నెలల మిషన్ కి గాను ఈ ముగ్గురు ఏస్ట్రోనట్స్ గత జూన్ 17 న ఈ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. పాలక కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని చైనా ఈ స్పేస్ ప్రోగ్రాం ని చేబట్టింది. కొద్దిసేపు శ్రమించిన అనంతరం స్పేస్ వాక్ చేసిన వ్యోమగాములు రోబోటిక్ చేతిని సరిగ్గా అమర్చగలిగారు. ఈ రోబోటిక్ ఆర్మ్.. ఆర్బిటల్ స్టేషన్ భాగాలను ఒకటిగా చేయడానికి ఉపయోగపడుతుంది. అవసరమైతే సుమారు 6 గంటలవరకు వాక్ చేయడానికి అనువుగా వీరి సూట్లను డిజైన్ చేశారట. షేంజూ క్యాప్స్యూల్ లో ఈ వ్యోమగాముల మిషన్ సాగింది.

వచ్చే సంవత్సరాంతానికి 70 టన్నుల ఆర్బిటల్ స్టేషన్ కి మరో రెండు మోడ్యూల్స్ ని కలిపేందుకు చైనా స్పేస్ ఏజెన్సీ మొత్తం 11 ప్రయోగాలను చేపట్టాలని ప్రతిపాదించింది. ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాలపై చైనా అభివృద్ధి పథంలో సాగుతుండగా అమెరికా లోలోపల విమర్శిస్తోంది. చైనా ఈ ప్రయోగాలను అంతరిక్షంలో కూడా తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి చేపడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే డ్రాగన్ కంట్రీ మాత్రం ఎడారుల్లో ఏర్పాటు చేసిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాల ద్వారా ఈ విధమైన మిషన్ లను కామ్ గా చేసుకునిపోతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: పంజాబ్ లో ‘కరెంట్ బేరసారాలు’.. ప్రజలకు సిద్దు, సీఎంల ‘తాయిలాలు’ ! ఎన్నికల ముందే ఎత్తుకు పైఎత్తులు

రెజ్లింగ్ మ్యాచ్ లు చూస్తా….నాకు టీవీ కావాలి…తీహార్ జైలు అధికారులకు రెజ్లర్ సుశీల్ కుమార్ లేఖ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu