Road Accident: నెత్తురోడిన తెలుగు రాష్ట్రాలు.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం..

Road Accidents in Telugu states: తెలుగు రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాలతో నెత్తురోడాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదివారం ఉదయం పలుచోట్ల

Road Accident: నెత్తురోడిన తెలుగు రాష్ట్రాలు.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం..
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 04, 2021 | 8:27 AM

Road Accidents in Telugu states: తెలుగు రాష్ట్రాలు రోడ్డు ప్రమాదాలతో నెత్తురోడాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదివారం ఉదయం పలుచోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో మొత్తం ఎనిమిది మంది మృతిచెందారు. హైదరాబాద్‌ నగర పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో.. అటుగా వచ్చిన లారీ వీరిపై నుంచి దూసుకెళ్లింది. మృతులను మహారాష్ట్రకు చెందిన కమ్రుద్దీన్, బబ్లూ, జమీల్‌గా గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో.. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరోకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. కారు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ చెందిన వారుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుపతిలో.. తిరుపతి అలిపిరి రోడ్డులో ఆగి ఉన్న లారీని అతివేగంతో వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతిచెందారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతపురంలో.. అనంతపురం బళ్లారి రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ఎదురెదురుగా వస్తున్న లారీ, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో లారీ రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హర్యానాకు చెందిన ట్రక్కు డ్రైవర్ అంజూమ్, క్లినర్ గయాల్‌కు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Lovers Suicide: ‘పెళ్లయి ఏడేళ్లయినా.. ప్రియుడిని మరువలేకపోయింది’.. ప్రేమజంట బలవన్మరణం..

Alcohol Robbery: రూ. 2 లక్షల విలువైన మద్యం చోరీ.. కారులో పరారు, అనుకోని ప్రమాదంతో మద్యాన్ని రోడ్డుపైనే వదిలేసి.