Lovers Suicide: ‘పెళ్లయి ఏడేళ్లయినా.. ప్రియుడిని మరువలేకపోయింది’.. ప్రేమజంట బలవన్మరణం..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Jul 04, 2021 | 8:02 AM

Lovers Suicide - Nagarkurnool: పెళ్లయి ఏడేళ్లయింది.. ఇద్దరు పిల్లలున్నా ఆ మహిళ.. ప్రియుడిని మరిచిపోలేక పోయింది. కట్టుకున్న భర్తను, పిల్లలను వదిలేసి

Lovers Suicide: ‘పెళ్లయి ఏడేళ్లయినా.. ప్రియుడిని మరువలేకపోయింది’.. ప్రేమజంట బలవన్మరణం..
lovers suicide

Lovers Suicide – Nagarkurnool: పెళ్లయి ఏడేళ్లయింది.. ఇద్దరు పిల్లలున్నా ఆ మహిళ.. ప్రియుడిని మరిచిపోలేక పోయింది. కట్టుకున్న భర్తను, పిల్లలను వదిలేసి ప్రియుడి వెంట వెళ్లిపోయింది. ఆ తర్వాత ప్రియుడు, ప్రియురాలు కలిసి బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని మద్దిమడుగులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలానికి చెందిన యువకుడు (30), యువతి(28) ఏడేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. అప్పుడే.. విషయం తెలియడంతో యువతి తల్లిదండ్రులు ఆమెకు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. ప్రస్తుతం వారికి ఇద్దరు కుమారులున్నారు.

అయినప్పటికీ.. ఆమె ప్రియుడిని మరువలేకపోయింది. నిత్యం ఫోన్‌లో ఆ యువకుడితో మాట్లాడుతూనే ఉండేది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల కుమారుడితో ఆమె, ఆ యువకుడు కలిసి పది రోజుల కిందట వారి ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. రెండు కుటుంబాల వారు ఇద్దరి కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర మండలంలోని మద్దిమడుగుకు చేరుకున్నారు. అనంతరం వారి వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే.. అంతకుముందు తాము చనిపోతున్నట్లు కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

దీంతో రెండు కుటుంబాల వారు మద్దిమడుగుకు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఆలయ సమీపంలోని వెతుకుతుండగా వివాహిత కుమారుడి ఏడుపు విని అక్కడికి చేరుకునేలోపే ఇద్దరూ విగత జీవులై కనిపించారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అమ్రాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో తలకొండపల్లి మండలంలో విషాదం నెలకొంది.

Also Read:

NIA: హైదరాబాద్‌ కేంద్రంగా ‘ఉగ్ర’ దర్యాప్తు జరపనున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ).. ఉగ్ర మూలాలపై అన్వేషణ..!

Gold and Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజాగా ఎంత పెరిగాయంటే..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu