AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NIA: హైదరాబాద్‌ కేంద్రంగా ‘ఉగ్ర’ దర్యాప్తు జరపనున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ).. ఉగ్ర మూలాలపై అన్వేషణ..!

NIA: దర్భంగా రైల్వేస్టేషన్‌లో పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందన్న ఆధారాలు లభించడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఉగ్రకోణం మూలాలను మరింతగా అన్వేషించేందుకు..

NIA: హైదరాబాద్‌ కేంద్రంగా 'ఉగ్ర' దర్యాప్తు జరపనున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ).. ఉగ్ర మూలాలపై అన్వేషణ..!
National Investigation Agency
Subhash Goud
|

Updated on: Jul 04, 2021 | 5:42 AM

Share

NIA: దర్భంగా రైల్వేస్టేషన్‌లో పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందన్న ఆధారాలు లభించడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఉగ్రకోణం మూలాలను మరింతగా అన్వేషించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పేలుడు ఘటన నేపథ్యంలో ఇప్పటివరకూ హైదరాబాద్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఢిల్లీలో భారీ ఎత్తున సోదాలు, దర్యాప్తు నిర్వహించింది ఎన్‌ఐఏ. ఇకపై హైదరాబాద్‌ కేంద్రంగా లోతుగా పరిశోధన కొనసాగించనున్నట్లు సమాచారం. ఉగ్రమూలాలను అన్వేషణలో భాగంగా స్వయంగా పర్యవేక్షించేందుకు ఎన్‌ఐఏ ఉన్నతాధికారులు హైదరాబాద్‌కు చేరుకున్నారని సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆదివారం ఎన్‌ఐఏ ఓ కీలక అధికారి రానున్నట్లు తెలిసింది. ఇక్కడి నుంచి వారు సోదరుల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఐఎస్‌ఐ లింకులపై ఆరా..

కాగా, పేలుడులో మల్లేపల్లిలో నివాసముంటున్న నసీర్‌ఖాన్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లు కీలకపాత్ర పోషించారు. మల్లేపల్లిలో 20 ఏళ్ల నుంచి మాలిక్‌ సోదరులు ఉంటున్నారు. బట్టల దుకాణం నిర్వహిస్తున్న వీరికి స్నేహితులు, సన్నిహితులు ఎవరైనా ఉన్నారా? పాస్‌పోర్టుల ఆధారంగా ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారన్న దానిపై ఆరా తీయనున్నారు. లేక తప్పుడు వివరాలతో పాస్‌ పోర్టులు పొందారా? అనే విషయంపై కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో ఉంటున్న ఇక్బాల్‌తో సంబంధాలున్నాయంటే పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐకి సంబంధాలున్నాయా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగించనున్నారు. మాలిక్‌ సోదరులకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని శామ్లి జిల్లాకు కైరానాకు చెందిన ఇద్దరు లష్కరేతోయిబా ఉగ్రవాదులు మహ్మద్‌ సలీమ్‌, కాఫిల్‌లు సహకరించారు. అయితే వారితో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి పేలుడు పదార్థాలను ఎలా, ఎక్కడికి పంపించాలో ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో మహ్మద్‌ సలీమ్‌.. పాకిస్థాన్‌లో లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుడైన ఇక్బాల్‌తో తరచూ సంప్రదింపులు జరుపుతూ ఇక్కడికి హవాలా రూపంలో డబ్బు తీసుకువచ్చేవాడని అధికారులు గుర్తించారు.

కాగా, దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నన నాసిర్‌, మాలిక్‌, ఇమ్రాన్‌ మాలిక్‌లను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జూన్‌ 17న బీహార్‌ దర్భంగా రైల్వే స్టేషన్‌లో వస్త్రాల పార్సిల్‌లో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే సికింద్రాబాద్‌ నుంచి ఈ పార్సిల్‌ను దర్భంగా రైలులో పంపినట్లు తేలడంతో తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసుల సహకారంతో నాంపల్లిలో ఉంటున్న వీరిద్దరిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.

ఇవీ కూడా చదవండి:

UP Local Body Polls: ఉత్తరప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకెళ్లిన బీజేపీ.. అఖిలేశ్ యాదవ్‌కు ఎదురుదెబ్బ

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో యాక్షన్ మొదలు పెట్టిన మావోయిస్టులు.. ఐర‌న్ ఓర్ ప్లాంట్‌ కార్మికుల‌ కిడ్నాప్

ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?