AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Local Body Polls: ఉత్తరప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకెళ్లిన బీజేపీ.. అఖిలేశ్ యాదవ్‌కు ఎదురుదెబ్బ

UP Local Body Polls: ఉత్తరప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్లింది. 75 జిల్లా పంచాయతీ చైర్‌ పర్సన్‌ సీట్లకు గానూ 60కుపైగా స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మాజీ..

UP Local Body Polls: ఉత్తరప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకెళ్లిన బీజేపీ.. అఖిలేశ్ యాదవ్‌కు ఎదురుదెబ్బ
Subhash Goud
|

Updated on: Jul 04, 2021 | 4:49 AM

Share

UP Local Body Polls: ఉత్తరప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ దూసుకెళ్లింది. 75 జిల్లా పంచాయతీ చైర్‌ పర్సన్‌ సీట్లకు గానూ 60కుపైగా స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆ పార్టీ ఆరు స్థానాలకే పరిమితమైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ వెలువడిన ఈ ఫలితాలు బీజేపీ నేతల్లో ఉత్సాహం నెలకొంది. అయితే మొత్తం 75 స్థానాలకు గానూ 67 స్థానాల్లో బీజేపీకి చెందిన మద్దతుదారులు చైర్‌పర్సన్లు విజయం సాధించినట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌సింగ్‌ వెల్లడించారు. ఇదే ఉత్సాహంతో 2022 శాసనసభ ఎన్నికల్లోనూ గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 3 వేల మంది జిల్లా పంచాయతీ సభ్యులు 75 మంది చైర్‌పర్సన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. పోలింగ్‌కు ముందే 21 చోట్ల బీజేపీ మద్దతుదారులు, ఎస్పీకి చెందిన ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన స్థానాలకు శనివారం ఉదయం ఓటింగ్‌ నిర్వహించి అనంతరం ఫలితాలు వెల్లడించారు. పార్టీ గుర్తులు లేకుండా ఈ ఎన్నికలు జరిగాయి.

కాగా, 2016లో జరిగిన ఇవే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 60 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం గమనార్హం. మరోవైపు ఈ ఎన్నికల్లో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని ఎస్పీ ఆరోపణలు గుప్పించింది. ఈ ఎన్నికలకు మాయావతి నేతృత్వంలోని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) దూరంగా ఉంది.

ఇవీ కూడా చదవండి:

‘నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజలు కోరుతున్నారు’.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ షాకింగ్ కామెంట్స్

TRS MLAs on Revanth: ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవి… మాపై మాట్లాడే హక్కు లేదు: రేవంత్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫైర్