TRS MLAs on Revanth: ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగవి… మాపై మాట్లాడే హక్కు లేదు: రేవంత్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫైర్
Balaraju Goud |
Updated on: Jul 03, 2021 | 10:26 PM
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలన్నారు రేవంత్‌రెడ్డి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయిన ఆయన్ను చెప్పులతో కొట్టాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
Jul 03, 2021 | 10:26 PM
రాళ్లు, చెప్పులు. తెలంగాణ రాజకీయం ఇప్పుడు వీటి చుట్టూ తిరుగుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలన్నారు రేవంత్‌రెడ్డి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయిన ఆయన్ను చెప్పులతో కొట్టాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ చేస్తే కరెక్ట్, ఇక్కడ తప్పా అని ప్రశ్నించారు. నిన్న రేవంత్ చేసిన వ్యాఖ్యలకు వరుస బెట్టి కౌంటర్ ఇచ్చారు అధికార పార్టీ శాసనసభ్యులు.
1 / 5
పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారిన వాళ్లని రాళ్లతో కొట్టి చంపాలి అంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒంటి కాలితో లేస్తున్నారు. మీరు రాళ్లతో కొడితే, మేం చెప్పులతో కొడతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు టీఆర్ఎస్ శాసనసభ్యులు.
2 / 5
మేం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం టీఆర్ఎస్‌లో వీలినం చేశామని ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. మావి సేవా రాజకీయాలు, నీది స్వార్థ రాజకీయాలు అంటూ రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. మాణిక్కం ఠాగూర్‌కి రూ. 25 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నావ్ అంటూ ఆరోపించారు. ఓటుకి నోటు కేసులో దొరికిన దొంగ తమ గురించి మాట్లాడటం ఏమిటంటూ సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. ఓటుకు పీసీసీ పదవులు, ఎమ్మెల్యేల సీట్లను అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని సుధీర్ రెడ్డి ధ్వజమెత్తారు.
3 / 5
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి రాజకీయ ఎదుగుదల మొత్తం వివాదాస్పదమేనని, రాళ్లతో కొట్టి చంపండి అనేది రాజ్యాంగంలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పార్టీలు మారితే సంసారం, కానీ ఇక్కడ మారితే వ్యభిచారమా’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రాజాంగ్యం ప్రకారమే తాము టీఆర్ఎస్‌లో విలీనమయ్యామని వెంకటరమణారెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి నిషేధిత సంస్థల భాష మాట్లాడుతున్నారు.. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసులు పెడతామన్నారు గండ్ర.
4 / 5
ఓటుకు నోటు కేసులో రెండ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారిని ఏం చేయాలో కూడా చెప్పాలని రేవంత్‌కు సూచించారు టీఆర్ఎస్ విప్ బాల్క సుమన్. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ ని ఏం చేయాలి? అని బాల్క ప్రశ్నించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు రేవంత్ ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.