‘నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజలు కోరుతున్నారు’.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ షాకింగ్ కామెంట్స్
బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజలు కోరుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. ఈ ప్రభుత్వం పట్ల వారు విసుగెత్తిపోయారని, మార్పును కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్యే.. జేడీ-యూ మాజీ నేత కూడా అయిన
బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రజలు కోరుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. ఈ ప్రభుత్వం పట్ల వారు విసుగెత్తిపోయారని, మార్పును కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. మాజీ ఎమ్మెల్యే.. జేడీ-యూ మాజీ నేత కూడా అయిన మహేశ్వర్ సింగ్ శనివారం ఆర్జేడీలో చేరిన సందర్భంగా మాట్లాడిన తేజస్వి.. ఈయన రాకతో తమ పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. మహేశ్వర్ సింగ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారని.. ఒకప్పుడు లోక్ జనశక్తి పార్టీలో ఉంటూ రామ్ విలాస్ పాశ్వాన్ కి సన్నిహితుడిగా ఉన్నారని ఆయన చెప్పారు. ఆయన సన్నిహితులు కూడా త్వరలో మా పార్టీలో చేరనున్నారు అన్నారు. ఈయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించామన్నారు. అటు రాష్ట్రంలో చాలామంది బీజేపీ నేతలు సైతం తమతో టచ్ లో ఉన్నారని.. కానీ వారి పేర్లు వెల్లడించబోనని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఏదో ఒక రోజున ఈ ప్రభుత్వం పడిపోవడం ఖాయమన్న రీతిలో ఆయన మాట్లాడారు. మంజిత్ సింగ్ అనే మరో మాజీ ఎమ్మెల్యే తనను కలిశారని.. ఆర్జేడీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. అయితే నితీష్ వర్గంలో మళ్ళీ చేరారని ఆయన చెప్పారు. కానీ మంజిత్ సింగ్ ఇప్పటికీ తనతో ఫోన్ ద్వారా మాట్లాడుతున్నారన్నారు.
ఇలా ఉండగా లోక్ జన శక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ కి తమ మద్దతు ఉంటుందని తేజస్వి యాదవ్ తెలిపారు. బీజేపీతో ఆయన పార్టీ సంబంధాలు అంటీముట్టనట్టుగా ఉన్నాయని ఆయన తెలిపారు. దీనిపై తాను చేసిన సూచనలను చిరాగ్ పరిగణనలోకి తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పీటల మీద పెళ్లి ఆపేసిన వధువు..జీవితాంతం కన్యగా ఉంటా కానీ తాగుబోతును పెళ్లాడను అంటూ..:Bride cancel wedding video.