AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.2 వేలు వేసేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం..!

PM Kisan Samman Nidhi Yojana: రైతులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలల్లో రైతులకు అత్యంత ఉపయోగపడే పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ప్రధాన్..

PM Kisan: రైతులకు శుభవార్త.. అకౌంట్లలోకి రూ.2 వేలు వేసేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం..!
Pm Kisan Samman Nidhi Yojana
Follow us
Subhash Goud

|

Updated on: Jul 04, 2021 | 6:06 AM

PM Kisan Samman Nidhi Yojana: రైతులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలల్లో రైతులకు అత్యంత ఉపయోగపడే పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం మళ్లీ రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి సిద్ధమవుతోంది. మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద మరోసారి అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఈ స్కీమ్ ద్వారా చాలా మంది రైతులకు ఎంతో మేలు జరుగనుంది. మోదీ సర్కార్ ఇప్పటికే రైతుల బ్యాంక్ ఖాతాల్లో 8 విడతల డబ్బును జమ చేసింది. ఇప్పుడు 9వ విడత డబ్బులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ నెలలో పీఎం కిసాన్ 9వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుందని నివేదికలు చెబుతున్నాయి. ఇకపోతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు అందిస్తోంది. అయితే ఈ డబ్బులు ఖాతాల్లోకి ఒకేసారి పడవు. విడతల వారీగా వస్తాయి. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది కేంద్రం. ఇంకా ఈ స్కీమ్‌లో చేరని వారు ఉంటే.. పీఎం కిసాన్ స్కీమ్ వెబ్‌సైట్ ద్వారా చేరవచ్చు. కేంద్ర సర్కార్‌ ప్రతి ఏడాది అర్హత గల ప్రతి రైతు బ్యాంకు ఖాతాలలో నాలుగు నెలలకోసారి ఈ 2 వేల రూపాయలను జమ చేస్తోంది.

కాగా, ఈ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నలకు అధిక ప్రాధాన్యత నిస్తోంది. రైతులు మరింతగా ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లను సైతం ప్రవేశపెడుతోంది మోదీ ప్రభుత్వం. అంతేకాదు రైతులకు వివిధ రకాల రుణాలను కూడా అందిస్తోంది. రైతన్నలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్రమోదీ ఎన్నో పథకాలను తీసుకువస్తోంది.

ఇవీ కూాడా చదవండి

Voter ID Address Change: మీ ఓటర్‌ ఐడీ కార్డులో అడ్రస్‌ను మార్చాలనుకుంటున్నారా..? ఇలా చేయండి

PM Kisan FPO Yojana: రైతులకు కేంద్రం శుభవార్త.. ఈ స్కీమ్‌లో చేరితే రూ.15 లక్షలు పొందవచ్చు.. ఎలాగంటే..!