Ponguru Narayana: నెల్లూరులో కనిపించని మాజీ మంత్రి నారాయణ..! అజ్ఞాతం వీడేదెప్పుడో..?

Amaravati land scam: పొంగూరు నారాయణ.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. 2014 వరకు నారాయణ విద్యా సంస్థల అధినేతగా తెలిసిన పొంగూరు

Ponguru Narayana: నెల్లూరులో కనిపించని మాజీ మంత్రి నారాయణ..! అజ్ఞాతం వీడేదెప్పుడో..?
Ponguru Narayana
Follow us

|

Updated on: Jul 04, 2021 | 12:53 PM

( Murali, Nellore, TV9 Reporter )

Amaravati land scam: పొంగూరు నారాయణ.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు. 2014 వరకు నారాయణ విద్యా సంస్థల అధినేతగా తెలిసిన పొంగూరు నారాయణ. ఎన్నికల అనంతరం టిడిపి అధికారంలోకి వచ్చాక అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యే కానప్పటికీ చంద్రబాబు క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. మున్సిపల్ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీకి కొత్త రాజధానిగా అమరావతి నిర్ణయం జరిగిన అనంతరం.. నారాయణకు సి.ఆర్.డి.ఏ చైర్మన్ గా అప్పటి సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. కొత్త రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ పద్దతి ద్వారా భూసేకరణ చేపట్టారు. రైతుల నుంచి 32 వేల ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో మాజీమంత్రి నారాయణ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర మంత్రిగా, సి.ఆర్.డి.ఏ చైర్మన్ గా ఎంత కీలకంగా ఉన్నారో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా నారాయణ అంతే కీలకపాత్ర పోషించారు. జిల్లాలో రాజకీయంగా, అభివృద్ధి పరంగా ఎలాంటి నిర్ణయమైనా నారాయణదే తుది నిర్ణయం.

జిల్లాలో ఎవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలన్నా తాను అనుకున్న వారికి పదవులు ఇప్పించడంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిని ఒప్పించగలిగే వారు. అమరావతిలో ఎంత బిజీగా ఉన్నా నెలలో 20 రోజులు నెల్లూరు జిల్లాలో నేతలకు, ప్రజలకు అందుబాటులో ఉండేవారు. పగలు అమరావతిలో ఉంటే రాత్రికి రాత్రి నెల్లూరుకు చేరుకునే వారు. అప్పట్లో నారాయణకు చీకటి మంత్రి అని ప్రతిపక్షాలు పేరును సైతం పెట్టాయి. అయినా సరే నారాయణ ఓ వెలుగు వెలిగారు. అలా వెలిగిన నేత నారాయణ ఇప్పుడు జిల్లాలో పూర్తిగా కనిపించడం లేదు. ఎక్కడ ఉన్నారో కూడా జిల్లా వాసులకు తెలియదు. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన నారాయణ ప్రస్తుత మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆతర్వాత జిల్లా, నగర ప్రజలకు ఎక్కడా అందుబాటులో లేరు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలపై ఇతర నేతలు స్పందిస్తున్నారే తప్ప ఇక్కడి నుంచి పోటీ చేసిన నారాయణ మాత్రం ఏనాడూ ఖండించారన్న దాఖలాలు లేవు.

జిల్లా విషయం అలా ఉంచితే అమరావతి, హైదరాబాద్‌లో కూడా నారాయణ బయటకు వచ్చిన సందర్భాలు లేవు. ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే చంద్రబాబుతో కలిసి మీడియాకి కనిపించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి భూముల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి.. ఇటీవల సిఐడి నారాయణకు నోటీసులు ఇచ్చిన సందర్భంలో కూడా ఆయన ఎక్కడా స్పందించలేదు. ఇక తాజాగా అప్పటి సి.ఆర్.డి.ఏ కమీషనర్ చెరుకూరి శ్రీధర్ అమరావతి భూముల ఆల్రమలపై విచారణ జరుపుతున్న సిఐడి ముందు వాంగ్మూలం ఇచ్చారు. భూముల సేకరణలో సమస్యలు వస్తాయని చెప్పినా నారాయణ పట్టించుకోలేదని.. తాను చెప్పినట్లు చేయాలని అదేశించారని చెప్పడంతో మరోసారి అమరావతి భూముల వ్యవహారం చర్చకు వచ్చింది. కనీసం ఇప్పుడైనా మాజీమంత్రి నారాయణ స్పందిస్తారని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.

అయితే.. నారాయణ కొంతకాలంగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం నారాయణ నెల్లూరులోని తన నివాసంలో కూడా లేరు.. ఎక్కడ ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేసినా.. ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో నెల్లూరు వాసులకు నారాయణని చూసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందోనని పలువురు బహిరంగంగా చర్చించుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read:

Twitter India: మత విద్వేశాలను రెచ్చగొడుతోంది.. ట్విట్టర్‌పై న్యాయవాది ఫిర్యాదు..

Vaccine Auto: వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ వినూత్న ప్రచారం.. ఆకట్టుకుంటున్న ‘వ్యాక్సిన్ ఆటో’.. వైరల్ వీడియో

న్‌ఆర్‌ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
న్‌ఆర్‌ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
భారత రెజ్లర్ల కొంపముంచిన దుబాయ్ వర్షాలు.. కారణం ఏంటంటే?
భారత రెజ్లర్ల కొంపముంచిన దుబాయ్ వర్షాలు.. కారణం ఏంటంటే?
పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి
ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు