Konaseema: కొనసీమలో కొత్త కళ..ఆ రైతులకు ముందే వచ్చిన పండగ

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో అరటి మార్కెట్లు కళకళలాడుతున్నాయి. అరటి రైతులకు వరుస పండుగలు పెళ్లిళ్లు రావడంతో అరటికి డిమాండ్ ఏర్పడింది.

Konaseema: కొనసీమలో కొత్త కళ..ఆ రైతులకు ముందే వచ్చిన పండగ
Banana Farmers
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 27, 2021 | 8:58 PM

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో అరటి మార్కెట్లు కళకళలాడుతున్నాయి. అరటి రైతులకు వరుస పండుగలు పెళ్లిళ్లు రావడంతో అరటికి డిమాండ్ ఏర్పడింది. దీంతో అరటి మార్కెట్ లు కళకళలాడుతున్నాయి. గత కొన్నాళ్లుగా కరోనా ప్రభావంతో ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.. బయటకు వెళ్లే మార్గాలు లేక, లాక్ డౌన్ పెట్టడంతో కొనే నాథుడు కూడా లేకపోవడంతో అరటి గెలలను మార్కెట్లోకి తెచ్చి వదిలేసి వెళ్ళిపోయేవారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తి వేయడంతోపాటు వరుస పండుగలు, పెళ్లిళ్లు, అయ్యప్ప దీక్షలు ప్రారంభం కావడంతో అరటి డిమాండ్ ఏర్పడింది.

దీనికితోడు వచ్చేది కార్తీక మాసం కావడంతో పూజలు ఎక్కువగా ఉంటాయి. పూజకు ఉపయోగించే కర్పూర రకం అరటికి డిమాండ్ పెరిగింది.. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూజకు ఉపయోగించే కర్పూర రకం గెల వంద రూపాయల నుండి సుమారు నాలుగు వందల రూపాయల వరకు పలుకుతుందని చెప్తున్నారు అరటి రైతులు. అదేవిధంగా ఇక్కడ నుండి ఇతర జిల్లాలకు ఎగుమతి అవడంతో మార్కెట్ పుంజుకుందని వ్యాపారులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న అరటి మార్కెట్ ఈసారి కొంత ఊరటనిచ్చింది అని చెబుతున్నారు. అయితే కోనసీమలో అధిక వర్షాల ప్రభావంతో పలుచోట్ల అరటి తోటలు దెబ్బతినడంతో ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉందని రైతులు వ్యాపారులు చెప్తున్నారు.

Also Read:  “చావనైనా చస్తామ్ కానీ, ఈ వాహనాన్ని పోనివ్వం”.. ఇంతకీ అందులో ఏమున్నాయ్

48 వేల మందికి ఉద్యోగాలు… ఆ రంగంలో కీలక ప్రాజెక్టులకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్