AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఈ జిల్లాలో ప్రత్యక్ష రాజకీయాలకు ఇద్దరు ఉద్ధండులు గుడ్ బై.. అసలు కారణం ఇదే?

విజయనగరం జిల్లా నుండి మరో ఇద్దరు రాజకీయ ఉద్దండులు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. నాలుగు దశబ్దాలకుపైగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆ ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‎గా మారింది. వారిలో ప్రధానంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ఒకరు.

AP News: ఈ జిల్లాలో ప్రత్యక్ష రాజకీయాలకు ఇద్దరు ఉద్ధండులు గుడ్ బై.. అసలు కారణం ఇదే?
Vijayanagaram Politicians
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Apr 13, 2024 | 12:27 PM

Share

విజయనగరం జిల్లా నుండి మరో ఇద్దరు రాజకీయ ఉద్దండులు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఇప్పటికే ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా కీలక పదవులు నిర్వహించిన అశోక్ గజపతి రాజు.. రాజకీయాలకు గుడ్ బై చెప్పగా అదే విజయనగరం జిల్లా నుంచి మరో ఇద్దరు కీలక సీనియర్ నేతలు కూడా రాజకీయాలకు దూరం కావడం హాట్ టాపిగ్గా మారింది. నాలుగు దశబ్దాలకుపైగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు రాజకీయాలకు దూరమయ్యారు. రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆ ఇద్దరు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‎గా మారింది. వారిలో ప్రధానంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ఒకరు. 1977 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో ఎంపిగా పోటీచేసి పార్లమెంట్‎లో అడుగుపెట్టిన కిషోర్ చంద్రదేవ్ నాటి నుండి నేటి వరకు రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా వ్యవహరించారు. ఇప్పటివరకు ఐదు సార్లు లోక్ సభకు, ఒకసారి రాజ్యసభకు ఎన్నికైన కిషోర్ చంద్రదేవ్ కేంద్ర పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖతో పాటు అనేక కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా జాతీయ పార్టీ అయిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ సభ్యులుగా, వార్ రూమ్ సభ్యులుగా కీలకంగా వ్యవహరించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కిషోర్ చంద్రదేవ్ అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుండి 2009 వరకు వరుసగా గెలుస్తూ వచ్చారు. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నుండి టిడిపిలో జాయిన్ అయ్యి 2019లో అరకు పార్లమెంట్ నుండి టిడిపి తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే నిన్న మొన్నటి వరకు టిడిపిలో కొనసాగిన కిషోర్ చంద్ర దేవ్ ఇటీవల టిడిపి ఎన్డీఏలో చేరడంతో టిడిపి నిర్ణయాన్ని విభేదిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

సుమారు డెబ్బై ఏళ్ల పైబడిన కిషోర్ చంద్రదేవ్ ప్రస్తుతం జరుగునున్న ఎన్నికల్లో కూడా అరకు పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థిగా ఏదో ఒక పార్టీ నుండి బరిలో దిగుతారని అంతా అనుకున్నారు. కానీ కిషోర్ చంద్రదేవ్ ఎన్నికల బరిలో లేకపోవడంతో జిల్లాలో పెద్ద చర్చే నడిచింది. అయితే కిషోర్ చంద్రదేవ్ అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పారని అంటున్నారు ఆయన అనుచరులు. ఇక జిల్లాకు చెందిన మరో కీలక నేత శత్రుచర్ల విజయరామరాజు. 1978 నుండి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న శత్రుచర్ల ఇప్పటివరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు ఎంపీగా, ఒక సారి ఎమ్మెల్సీగా పనిచేశారు. రాష్ట్ర అటవీ శాఖ, రవాణా శాఖతో పాటు పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. తరువాత 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుండి టిడిపిలోకి జాయిన్ అయిన శత్రుచర్ల 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.. ఆ తరువాత 2017లో జరిగిన స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈయన రాష్ట్ర రాజకీయాల్లో పలు క్లిష్ట పరిస్థితుల్లో కీలకంగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఈయన అనారోగ్య కారణాలతో ఎన్నికలకు దూరం అవ్వడంతో పాటు ప్రత్యక్ష రాజకీయాలకు సైతం గుడ్ బై చెప్పారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు రాజకీయాల నుండి నిష్క్రమించడంతో వీరి అభిమానులు, అనుచరులు ఆవేదన చెందుతున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కీలకంగా ఉన్న వీరిద్దరిపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మరక కూడా లేకపోవడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..