Nandamuri Balakrishna: మరోసారి అభిమానిపై చేయిచేసుకున్న బాలకృష్ణ
మరోసారి బాలయ్యకు కోపం వచ్చింది. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అభిమానులు మీద పడటంతో.. ఆయన అసహనానికి లోనయ్యారు. మోచేతితో ఫ్యాన్‌కు ఒక్కటి ఇచ్చారు. ప్రజంట్ అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

బాలయ్య అంటే ముక్కుసూటి తత్వం.. బాలయ్య అంటే టెంపర్.. బాలయ్య అంటే టెర్రర్.. తేడా వస్తే ఆయన చేతితోనే సమాధానం చెబుతారు.. ఇది బయట ఉన్న టాక్. అయితే సినిమావాళ్లు మాత్రం ఆయన మనసు వెన్న అని చెబుతుంటారు. చిన్నపిల్లాడి మనస్థత్వం అని.. తమతో ఎంతో బాగుంటారని చెప్పడం చాలాసార్లు విన్నాం. కానీ వాళ్లు చెప్పే మాటలకు.. బాలయ్య బయట ప్రవర్తనకు పొంతన ఉండదు. ఇప్పటికే చాలాసార్లు తమ అభిమానులపై చేయి చేసుకున్నారు. కొట్టడం బాలయ్యకు… కొట్టించుకోవడం ఆయన ఫ్యాన్స్‌కు అలవాటు అయిపోయినట్లుంది. ఇలాంటి ఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి అభిమానిపై చేయిచేసుకున్నారు బాలకృష్ణ. కదిరిలో బాలకృష్ణతో సెల్ఫీ కోసం ఫ్యాన్స్ ప్రయత్నించారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి నెట్టుకోవడంతో.. బాలయ్య ఆగ్రహానికి గురయ్యారు. ఆగ్రహంతో అభిమానిని మోచేతితో కొట్టారు. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ మారింది.
అయితే బాలయ్య స్థాయి సెలబ్రిటీలు ఎవరు బయటకు వెళ్లినా బౌన్సర్లను పెట్టుకుంటూ ఉంటారు. ఫ్యాన్స్ ఎగబడినప్పుడు బౌన్సర్లే తొయ్యడం, నెట్టడం వంటివి చేస్తుంటారు. కానీ బాలకృష్ణ మాత్రం బౌన్సర్లను పెట్టుకోరు. తన ఫ్యాన్స్‌ను మందలించినా, వాయించినా అది తానే అయి ఉండాలని.. తన అభిమానులపై మరొకరు చేయి చేసుకోవడం ఆయనకు ఇష్టం ఉండదని ఓ సెలబ్రిటీ గతంలో వ్యాఖ్యానించారు.
బాలయ్య అభిమానిని కొట్టిన వీడియో దిగువన చూడండి…
నేటి నుంచి బాలకృష్ణ ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’
ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రాయలసీమలో NDA అభ్యర్థులను గెలిపించే బాధ్యతను ఆయన భుజానికి ఎత్తుకున్నారు. ఇందుకోసం ‘బాలయ్య అన్‌స్టాపబుల్’ పేరుతో ప్రత్యేకంగా ఓ బస్సును రెడీ చేశారు. ‘ఈ ఎన్నికల్లో మళ్లీ హిందూపురం నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ ఏప్రిల్ 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




