Janasena: 'నీ భవిష్యత్‌‌కు నాది హామి..' కిరణ్ రాయల్‌తో పవన్ కల్యాణ్

Janasena: ‘నీ భవిష్యత్‌‌కు నాది హామి..’ కిరణ్ రాయల్‌తో పవన్ కల్యాణ్

Ram Naramaneni

|

Updated on: Apr 13, 2024 | 1:39 PM

తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్‌ కిరణ్ రాయల్‌తో భేటీ అయిన పవన్‌ కల్యాణ్‌..తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజయానికి పనిచేయాలని ఆదేశించారు. భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తానని కిరణ్‌కు స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా పార్టీ కోసం పడ్డ కష్టం తనకు తెలుసన్న పవన్‌ కల్యాణ్‌..కిరణ్‌ రాయల్‌కు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. 

తిరుపతి జనసేనలో అసంతృప్తిపై దృష్టిపెట్టిన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. కూటమి నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ముందుగా టీడీపీ నేతలతో సమావేశమైన పవన్..ఆ పార్టీలో అసమ్మతి నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. తిరుపతి జనసేన టికెట్ కేటాయింపు, అభ్యర్థి ఎంపిక నిర్ణయం చంద్రబాబుతో కలిసి తీసుకున్నదేనని స్పష్టం చేసిన పవన్‌ కల్యాణ్‌..కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు. తిరుపతి టీడీపీ ఇన్‌ఛార్జ్‌ సుగుణమ్మతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు పవన్ కల్యాణ్‌. అనంతరం జనసేనతో నేతలతో మాట్లాడారు.

తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్‌ కిరణ్ రాయల్‌తో భేటీ అయిన పవన్‌ కల్యాణ్‌..తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజయానికి పనిచేయాలని ఆదేశించారు. భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తానని కిరణ్‌కు స్పష్టం చేశారు. గత 5 ఏళ్లుగా పార్టీ కోసం పడ్డ కష్టం తనకు తెలుసన్న పవన్‌ కల్యాణ్‌..కిరణ్‌ రాయల్‌కు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..