Kesineni Nani Vs Chinni: బెజవాడ కేశినేని బ్రదర్స్‌ మధ్య సరి కొత్త చిచ్చు.. లోకేష్ యాత్రకు ముందు టీడీపీలో చర్చ.. రచ్చ..!

కోస్తాంధ్రా అయినా.. ఉత్తరాంధ్ర అయినా.. రాయలసీమ అయినా.. మరేదైనా.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాటుగానే ఉంటాయి.. పార్టీల మధ్యే రచ్చే కాదు.. కొందరి కుటుంబంలోనూ పార్టీల పొరు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా.. బెజవాడలో మరో పొలిటికల్ సీన్ హాట్ హాట్ టాపిక్ గా మారింది.. అది కూడా తెలుగుదేశం పార్టీలో.. విజయవాడ టీడీపీలోని కేశినేని బ్రదర్స్‌ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

Kesineni Nani Vs Chinni: బెజవాడ కేశినేని బ్రదర్స్‌ మధ్య సరి కొత్త చిచ్చు.. లోకేష్ యాత్రకు ముందు టీడీపీలో చర్చ.. రచ్చ..!
Kesineni Nani Vs Chinni
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 12, 2023 | 9:00 PM

విజయవాడ, ఆగస్టు 12: కోస్తాంధ్రా అయినా.. ఉత్తరాంధ్ర అయినా.. రాయలసీమ అయినా.. మరేదైనా.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాటుగానే ఉంటాయి.. పార్టీల మధ్యే రచ్చే కాదు.. కొందరి కుటుంబంలోనూ పార్టీల పొరు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా.. బెజవాడలో మరో పొలిటికల్ సీన్ హాట్ హాట్ టాపిక్ గా మారింది.. అది కూడా తెలుగుదేశం పార్టీలో.. విజయవాడ టీడీపీలోని కేశినేని బ్రదర్స్‌ హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సొంత అన్నాదమ్ముల మధ్యే పొలిటికల్ రచ్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. తాజాగా.. బెజవాడ టీడీపీలోని కేశినేని బ్రదర్స్‌ మధ్య మరోసారి రాజకీయ రచ్చ మొదలైంది. టీడీపీ నేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర నేపథ్యంలో బాధ్యతల విషయంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 19న విజయవాడ పార్లమెంట్‌ పరిధిలో లోకేష్ పాదయాత్ర ఎంటర్‌ అవుతుంది. 19 నుంచి 22 వరకూ విజయవాడలోనే లోకేష్‌ పాదయాత్ర జరుగనుంది. సిటీలో మూడు నియోజకవర్గాలతో పాటు గన్నవరంలో భారీ ఏర్పాట్లు చేయాలని నేతలు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నానికి కాకుండా పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యతలను కేశినేని చిన్నికి అప్పగించారు. అధిష్టానమే స్వయంగా చిన్నికి బాధ్యతలు అప్పగించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అది కాస్త రచ్చగా మారి.. పరస్పర విమర్శలకు దారితీసింది. ఈ నిర్ణయాల నేపథ్యంలో నానిని సైడ్‌ చేస్తున్నారా అంటూ తెలుగుదేశం క్యాడర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే, ఇటీవల ఎంపీ కేశినేని నాని పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాని.. డైరెక్ట్ గా పార్టీ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో లోకేష్‌ పాదయాత్రలో కేశినేని నాని పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న నాని.. వైసీపీ ఎమ్మెల్యేలను పొగడ్తలతో ముంచెత్తారు. సొంత పార్టీ ఇన్‌ఛార్జ్‌లను గొట్టంగాళ్లంటూ కామెంట్‌ చేశారు. ఇండిపెండెంట్‌గాను గెలిచే సత్తా ఉందని కూడా ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు. చివరకు మహానాడుకు కూడా తనను ఆహ్వానించలేదంటూ ఫైర్ అయ్యారు.

వీడియో..

అయితే, కొంతకాలంగా కేశినేని నానిపై టీడీపీ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం వారిపై పొగడ్తలు కురిపించడం పార్టీ నాయకత్వానికి ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో సొంత పార్టీ నియోజకవర్గాలకు చెందిన ఇన్‌ఛార్జ్‌లను కూడా గొట్టంగాళ్లంటూ చేసిన వ్యాఖ్యలపై పార్టీలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం తర్వాత పార్టీ కార్యక్రమాలకు నాని దూరంగా ఉన్నారు. నాని పార్టీలో ఉన్నట్టా? లేనట్టా అన్న చర్చ కూడా సాగింది. సరిగ్గా ఇదే సమయంలో మరోసారి లోకేష్‌ పాదయాత్ర బాధ్యతలు కూడా ఆయనకు ఇవ్వకుండా, సోదరుడు చిన్నికి అప్పగించడంతో అధిష్టానమే ఆయన్ను సైడ్‌ చేస్తుందా అని పార్టీలో చర్చ మొదలైంది. అయితే.. నాని దీనిపై ఇంకా స్పందించలేదు.. ఆయన ఏ విధంగా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

తాజాగా.. నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో బెజవాడ కేశినేని బ్రదర్స్‌ మధ్య కొత్త చిచ్చు రాజుకోవడంతో.. టీడీపీలో సరికొత్త చర్చ మొదలైంది. ఇది మున్ముందు పొలిటికల్ గా ఎలాంటి రూపం దాల్చుతుందో వేచిచూడాల్సిందే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..