Tirumala Lakshita Incident: లక్షిత మృతితో నడకదారిపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీటీడీ.. వీడియో.

Tirumala Lakshita Incident: లక్షిత మృతితో నడకదారిపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీటీడీ.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Aug 12, 2023 | 8:35 PM

లక్షిత మృతి నేపథ్యంలో నడకదారిపై టీటీడీ ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ఘాట్‌రోడ్డులో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలను నిలిపివేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే అలిపిరి నడకదారి నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత, శ్రీవారి మెట్టుమార్గం నుంచి మధ్యాహ్నం 3 గంటల తర్వాత అనుమతించే విషయంపై సమాలోచనలు జరుపుతున్నారు.

లక్షిత మృతి నేపథ్యంలో నడకదారిపై టీటీడీ ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ఘాట్‌రోడ్డులో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలను నిలిపివేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే అలిపిరి నడకదారి నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత, శ్రీవారి మెట్టుమార్గం నుంచి మధ్యాహ్నం 3 గంటల తర్వాత అనుమతించే విషయంపై సమాలోచనలు జరుపుతున్నారు. అంతేకాదు, నడకదారుల్లో 500 సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చూస్తామన్నారు ఈవో ధర్మారెడ్డి. వివిధ విభాగాల అధికారులతో భేటీ అయిన ఆయన.. భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. అటు.. నిన్న రాత్రి 7 గంటల ప్రాంతంలో తప్పిపోయిందనుకున్న లక్షిత కోసం.. ఇవాళ ఉదయం వరకు వెతికారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో కనిపించకుండా పోవడంతో ఇవాళ ఉదయం వరకు కూంబింగ్‌ నిర్వహించారు. టెంపుల్‌కు సమీపంలో ఓ లోయ దగ్గర చిన్నారి డెడ్‌బాడీని గుర్తించారు. మొదట ఎలుగుబంటి దాడి చేసిందని భావించినప్పటికీ, ఫోరెన్సిక్ విభాగం విచారణలో చిరుతగా నిర్ధారించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...