AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: క్లీనిక్‌కు వెళ్లి పిప్పి పళ్లు పీకించుకున్న మహిళ.. ఇంటికి వచ్చాక వాంతులు.. ఆపై

పంటి నొప్పితో హాస్పిటల్‌కు వెళ్తే.. ఆ మహిళ ప్రాణాలే పోయాయి. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లా రమణయ్యపేట శివారు గైగోలుపాడులో జరిగింది. డెంటిస్ట్ తప్పిదమే ఆమె చావుకు కారణం అని కుటుంబ సభ్యులు చెబుతుంటే.. మహిళకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

Andhra: క్లీనిక్‌కు వెళ్లి పిప్పి పళ్లు పీకించుకున్న మహిళ.. ఇంటికి వచ్చాక వాంతులు.. ఆపై
Toothache
Ram Naramaneni
|

Updated on: Sep 03, 2025 | 2:49 PM

Share

వివరాల్లోకి వెళ్తే గైగోలుపాడుకు చెందిన మేడిశెట్టి దుర్గాభవానీ.. పిప్పి పన్ను కారణంగా చెప్పలేని బాధ అనుభవిస్తున్నారు. పెయిన్ ఎక్కువ కావడంతో ఆగస్టు 30వ తేదీ రాత్రి సర్పవరం‌లో ఓ డెంటల్ క్లీనిక్‌కు వెళ్లారు. అక్కడ బాధితురాలి పళ్లను గమనించిన లేడీ డాక్టర్.. మత్తు ఇచ్చి ఒకేసారి 6 పళ్లను తొలగించారు. ఆపై రెగ్యులర్ ప్రొటోకాల్ ప్రకారం చికిత్స అందించి ఇంటికి పంపారు.

ఇంటికి వెళ్లిన తర్వాత దుర్గాభవానీకి చిగుళ్ల నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. ఆపై వాంతులు కూడా అయ్యాయి. దీంతో పళ్లు పీకిన డాక్టర్‌కు ఫోన్ చేస్తే ఆమె నుంచి స్పందన రాలేదని కుటుంభసభ్యులు చెబుతున్నారు. పరిస్థితి చేయి దాటడంతో.. దుర్గాభవానిని అర్ధరాత్రి సమయంలో మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ 3 రోజులు చికిత్స అందించినా ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. మంగళవారం చేసిన పరీక్షల్లో ఆమెకు బోన్‌మ్యారో క్యాన్సర్ ఉందని లేలిందట. అలాగే మెదడులో రక్తస్రావం జరిగి బ్రెయిన్ డెడ్ అయినట్లు అక్కడి డాక్టర్లు తేల్చారు.

సోమవారం రాత్రి తనతో బాగానే మాట్లాడిన భార్య.. మంగళవారం ఉదయానికి చనిపోవడంతో ఆమె భర్త వెంకటరమణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యకు క్యాన్సర్ అని తమకు తెలియదంటున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యమే తన భార్య మరణానికి కారణమని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.