AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీబీఎస్‌ఈ స్కూల్‌ నిర్వాకం.. పదో తరగతి విద్యార్థుల మార్కుల మెమోలు మిస్సింగ్‌!

పదో తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బోర్డు పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్ధుల మార్కుల మెమోలు గల్లంతైనాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సీబీఎస్‌ఈ పాఠశాలలో వెలుగు చూసింది...

సీబీఎస్‌ఈ స్కూల్‌ నిర్వాకం.. పదో తరగతి విద్యార్థుల మార్కుల మెమోలు మిస్సింగ్‌!
CBSE Class 10th students' mark memos are missing
Srilakshmi C
|

Updated on: Sep 03, 2025 | 2:36 PM

Share

అమరావతి, సెప్టెంబర్‌ 3: సీబీఎస్సీ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్థులకు మార్కుల మెమోలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బోర్డు పరిధిలోని ఓ పాఠశాలలో విద్యార్ధుల మార్కుల మెమోలు గల్లంతైనాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సీబీఎస్‌ఈ పాఠశాలలో వెలుగు చూసింది. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలను చుట్టముట్టారు. పాఠశాల యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మండల విద్యాశాఖాధికారులకు కూడా వరుస ఫిర్యాదులు చేశారు.

సీబీఎస్‌ఈ రీజనల్‌ కార్యాలయం నుంచి పోస్టు ద్వారా పాఠశాలకు మార్కుల మెమోల బండిల్‌ పంపగా.. స్కూల్‌లోని ఓ ఉద్యోగి సంతకంపెట్టి వాటిని తీసుకున్నట్టు తపాలా శాఖ ధ్రువీకరించింది. అయితే స్కూల్‌కు వచ్చిన మార్కుల మెమోలు ఎక్కడికి చేరాయనే దానిపై స్పష్టత కరువైంది. దీంతో గత 2, 3 నెలలు స్కూల్‌ చుట్టూ తిరుగుతుంటే.. విద్యార్ధులకు మాత్రం వాటిని జారీ చేయడంపై తీవ్ర జాప్యం నెలకొంది. బండిల్స్‌ గల్లంతైనాయని దాటవేస్తున్నారే తప్ప, ఎప్పుడిస్తారనేది మాత్రం చెప్పట్లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కొంతమంది తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఇంకెప్పుడు ఇంటర్‌లో ప్రవేశాలు పొందాలని, మార్కుల మెమోల ఒరిజినల్స్‌ వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దీనిపై స్పందించిన మండల విద్యాశాఖాధికారులు.. పాఠశాల యాజమాన్యాన్ని పిలిపించి వివరణ తీసుకున్నారు. పోస్టులో వచ్చిన మార్కుల మెమోలు ఏమయ్యాయో తెలియడం లేదనీ, మరోమారు పంపించమని సీబీఎస్‌ఈ బోర్డుకు లేఖ రాశామని స్కూల్‌ యాజమాన్యం వివరణ ఇచ్చినట్లు డిప్యూటీ డీఈవో శాంతకుమారి తెలిపారు.ఈ స్కూల్లో చదివిన మొత్తం 83 మంది విద్యార్థుల మార్కుల మెమోలు గల్ల్లంతైనట్లు అధికారులు గుర్తించారు.ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం కూడా మెమోల గల్లంతుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డిప్యూటీ డీఈవో శాంతకుమారి వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..