AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నడిరోడ్డుపై యువతిని నరికిన ప్రేమోన్మాదికి జీవితఖైదు.. 143 రోజుల్లోనే తీర్పు వెలువరించిన కోర్టు

కాకినాడ రూరల్, కూరాడ గ్రామానికి చెందిన దేవికను గతేడాది అక్టోబర్లో దారుణంగా హతమార్చాడు ప్రేమోన్మాది  సూర్యనారాయణ. బైక్ పై వెళ్తున్న ఆమెను వెంబడించి  కాండ్రేగుల- కూరాడ దారి మధ్యలో కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా నరికిచంపాడు.

Andhra Pradesh: నడిరోడ్డుపై యువతిని నరికిన ప్రేమోన్మాదికి జీవితఖైదు.. 143 రోజుల్లోనే తీర్పు వెలువరించిన కోర్టు
Suryanarayana
Basha Shek
|

Updated on: Mar 01, 2023 | 7:00 AM

Share

కాకినాడ రూరల్, కూరాడ గ్రామానికి చెందిన దేవికను గతేడాది అక్టోబర్లో దారుణంగా హతమార్చాడు ప్రేమోన్మాది  సూర్యనారాయణ. బైక్ పై వెళ్తున్న ఆమెను వెంబడించి  కాండ్రేగుల- కూరాడ దారి మధ్యలో కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా నరికిచంపాడు. ఇతడికి జీవిత ఖైదు, ఐదు వేల రూపాయల జరిమానా విధించింది కాకినాడ జిల్లా మూడవ అదనపు సెషన్స్ కోర్టు. తనను ప్రేమించడం లేదని దేవికను వెంటాడి అత్యంత కిరాతకంగా హతమార్చాడు సూర్యనారాయణ. దేవికా మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్ ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయం అందజేశారు. అంతే కాకుండా సీఎం జగన్ ఆదేశాలతో దిశ చట్టం స్ఫూర్తితో.. కేసు విచారణ చేశారు పెదపూడి పోలీసులు. నిందితుడ్ని 24 గంటల్లో అరెస్టు చేసి.. తొమ్మిది రోజుల్లోనే చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. ఘటన జరిగిన 143 రోజుల్లో విచారణ సైతం పూర్తి చేసింది న్యాయస్థానం. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి చెంపపెట్టు గా త్వరితగతిన ఈ కేసు విచారణ జరిపినట్టు చెబుతున్నారు పోలీసులు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎంతో సీరియస్ గా ఉందని, ఈ దిశగా పోలీసు విభాగం కూడా తక్షణమే స్పందిస్తుందని అంటున్నారు జిల్లా పోలీసులు. కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ. మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు కాకినాడ జిల్లా ఎస్పీ. తనను ప్రేమించకుండా దూరం పెడుతుందనే అక్కసుతో దేవిక అనే యువతిని అక్టోబర్ 8వ తేదీ ఉదయం 11 గంటలప్పుడు నడిరోడ్డుపై అతి కిరాతకంగా కత్తితో నరికి చంపాడీ ప్రేమోన్మాది.

ఈ ఘటనపై మృతురాలి చిన్నాన్న ఇచ్చిన కంప్లయింట్ పై పెదపూడి పోలీసులు.. ఐపీసీ 302 కింద కేసు పెట్టారు. హత్య జరిగిన వెంటనే స్థానికుల సహకారంతో ముద్దాయిని అదుపులోనికి తీసుకుని 24 గంటల లోపే కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తులో పూర్తి ఆధారాలు సేకరించి 7 పని దినాలలోపే ఛార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. పోస్టుమార్టం తదితర రిపోర్టులు సకాలంలో అందించి దర్యాప్తు పూర్తి చేయించారు. కోర్టు విచారణను స్వయంగా పర్యవేక్షించారు ఉన్నతాధికారులు . దీంతో ఈ కేసు త్వరితగతిన పూర్తియనట్టు చెబుతున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి