Andhra Pradesh: ఏపీ సర్కారుకు ఉద్యోగుల అల్టిమేటం.. పోరుబాటపై సీఎస్‌కు నోటీసులు.. డెడ్‌లైన్‌ ఎప్పుడంటే?

అల్టిమేటం ఇచ్చినట్టే మరోసారి ఉద్యమానికి రెడీ అయిపోయారు ఏపీ ఉద్యోగులు. సమస్యల పరిష్కారం కోసం యుద్ధం ప్రకటించారు. అయితే, ఈసారి పోరాటం మాములుగా ఉండదంటున్నారు ఉద్యోగులు. ఏదోఒకటి తేల్చుకునేవరకు తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు

Andhra Pradesh: ఏపీ సర్కారుకు ఉద్యోగుల అల్టిమేటం.. పోరుబాటపై సీఎస్‌కు నోటీసులు.. డెడ్‌లైన్‌ ఎప్పుడంటే?
Bopparaju Venkateswarlu
Follow us
Basha Shek

|

Updated on: Mar 01, 2023 | 6:35 AM

చెప్పినట్టే ఏపీ ఉద్యోగులు మరోసారి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. అయితే, ఈసారి పోరాటం అల్లాటప్పాగా ఉండదంటున్నారు. తమ డిమాండ్లు, సమస్యలను పరిష్కరించకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అల్టిమేటం ఇచ్చినట్టే మరోసారి ఉద్యమానికి రెడీ అయిపోయారు ఏపీ ఉద్యోగులు. సమస్యల పరిష్కారం కోసం యుద్ధం ప్రకటించారు. అయితే, ఈసారి పోరాటం మాములుగా ఉండదంటున్నారు ఉద్యోగులు. ఏదోఒకటి తేల్చుకునేవరకు తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు. తమ పోరాటానికి మార్చి 9ని ముహూర్తంగా ఎంచుకున్నారు ఎంప్లాయిస్‌. అందుకు సంబంధించి సీఎస్‌ జవహర్‌రెడ్డికి నోటీసులు కూడా ఇచ్చేశారు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలకు పిలుపునిచ్చింది ఏపీ ఉద్యోగుల అమరావతి జేఏసీ. పోరాటంలో భాగంగా ప్రతి ఉద్యోగి నల్లబ్యాడ్జీ ధరించి నిరసన తెలపాలని సూచించారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. గతంలో మాదిరిగా ఈసారి మధ్యలోనే ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు బొప్పరాజు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేవరకు పోరాటం కొనసాగుతుందంటున్నారు.

ఉద్యోగుల సమస్యలపై ఏడాదిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు, రాయితీలు ఇవ్వడం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 11వ పీఆర్సీ బెనిఫిట్స్‌ ఎక్కడ?, 2018 నుంచి రావాల్సిన 6 డీఏలు, పీఆర్సీ బకాయిలు ఎప్పడిస్తారంటూ ప్రశ్నించారు. ఈసారి తమ పోరాటం సీరియస్‌గా ఉంటుందంటూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు బొప్పరాజు వెంకటేశ్వర్లు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?