Andhra Pradesh: మెడికో ప్రీతి ఘటనతో ఏపీ అప్రమత్తం.. కాలేజీల్లో ర్యాగింగ్ కట్టడికి మంత్రి రజిని కీలక ఆదేశాలు
తెలంగాణలో ర్యాగింగ్ భూతం.. విజృంభించడంతో.. మెడికో ప్రీతి ఆత్మహత్యతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో ఏపీ కూడా అప్రమత్తమైంది. మంత్రి విడదల రజిని అధ్వర్యంలో.. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్స్ తో సమీక్ష నిర్వహించారు.
తెలంగాణలో ర్యాగింగ్ భూతం.. విజృంభించడంతో.. మెడికో ప్రీతి ఆత్మహత్యతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీంతో ఏపీ కూడా అప్రమత్తమైంది. మంత్రి విడదల రజిని అధ్వర్యంలో.. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్స్ తో సమీక్ష నిర్వహించారు. ర్యాగింగ్ విషయంలో కఠినంగా ఉండమని సూచించారు మంత్రి. యాంటీ ర్యాగింగ్ కమిటీలు పూర్తి స్థాయిలో పని చేయాలని అన్నారు. మెడికల్ కాలేజీల్లో ఎలాంటి వేధింపులు ఉండటానికి వీల్లేదనీ.. ర్యాగింగ్ ఎంత పెద్ద నేరమో తెలిసేలా అవగాహన కల్పించాలనీ అన్నారామె. మెడికల్ కళాశాలల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు ఉండాలనీ. ఒత్తిడితో బాధ పడుతున్న విద్యార్దులను గుర్తించి మరీ వారి సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నారు. అలాగే పీజీ విద్యార్ధులపై పని భారం పెరగడానికి వీల్లేదనీ అన్నారు. అన్ని కాలేజీల్లో 24 గంటల హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేయాలనీ సూచించారు మంత్రి విడదల రజిని. విద్యార్థులకు కౌన్సెలింగ్, యోగా, ధ్యానం వంటి ప్రక్రియలు అందుబాటులోకి తేవాలనీ ఆదేశించారు. ఇక తెలంగాణలోనూ ర్యాగింగ్ భూతాన్ని అణగదొక్కడంపై భారీ ఎత్తున చర్చ మొదలైంది. ఇకపై ర్యాగింగ్ కి పాల్పడ్డ విద్యార్ధులను ఒకట్రెండు నెలల పాటు సస్పెండ్ చేసి సరిపుచ్చడం సరికాదన్న వాదన వినిపిస్తోంది.
నేడు కేఎంసీ సమీక్షా సమావేశం..
ర్యాగింగ్ చేసిన విద్యార్ధి మెడికల్ సీటును రద్దు చేసేలా ప్రభుత్వం అడుగులు వేసేలా కనిపిస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు.. మెడికోల పనివేళలపైనా వైద్యశాఖ దృష్టి సారిస్తోంది. గంటల కొద్దీ డ్యూటీల విషయంలో పునరాలోచన చేస్తోంది. ముఖ్యంగా హౌస్ సర్జన్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్స్ కి 36 నుంచి 48 గంటల మేర ఏకధాటిగా డ్యూటీలు పడుతున్నాయి. దీంతో కొందరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ విషయంపై పునరాలోచన చేసే దిశగా వైద్యశాఖ ప్రయత్నిస్తోంది. ఈ అంశాలన్నిటిపై వరంగల్- కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ చర్చించే ప్రయత్నం చేసింది. పన్నెండు మందితో కూడిన యాంటీ ర్యాగింగ్ కమిటీలో ఇద్దరు కీలక సభ్యులు గైర్హాజరు కావడంతో.. ఈ సమావేశం వాయిదా పడింది. ఇవాళ మధ్యాన్నం కేఎంసీ పాలక వర్గం సమీక్షా సమావేశం నిర్వహించనుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..