Andhra Pradesh: మాజీ మంత్రి నారాయణ కుటుంబసభ్యులకు సీఐడీ నోటీసులు.. మార్చి 6న విచారణకు ఆదేశాలు..

సీఆర్‌డీఏ ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పు కేసులో సీఐడీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 41A కింద నోటీసులు ఇచ్చింది. మార్చి 6వ తేదీ...

Andhra Pradesh: మాజీ మంత్రి నారాయణ కుటుంబసభ్యులకు సీఐడీ నోటీసులు.. మార్చి 6న విచారణకు ఆదేశాలు..
Narayana CID
Follow us

|

Updated on: Feb 28, 2023 | 5:42 PM

సీఆర్‌డీఏ ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పు కేసులో సీఐడీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 41A కింద నోటీసులు ఇచ్చింది. మార్చి 6వ తేదీ విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. నారాయణ, ఆయన భార్య రమాదేవితో పాటు.. నారాయణ సంస్థల ఉద్యోగి ప్రమీలకు నోటీసులు ఇష్యూ చేసింది. రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ ఎంపీ కేపీవీ అంజనీకుమార్‌, సీఆర్‌పీసీ 160 కింద సింధూర, షారిణితో పాటు మరో నలుగురికి నోటీసులు ఇచ్చింది. పునీత్‌, మరో ఉద్యోగికి కూడా నోటీసులు పంపించింది సీఐడీ. నారాయణ కుమార్తెలు 7 లేదా 8వ తేదీ విచారణకు రావాలన్న నోటీసుల్లో స్పష్టం చేసింది.

కాగా.. హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకల పైనే సోదాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఉన్న నారాయణ కుటుంబీకుల నివాసాలపై సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నారాయణపై ఏపీ సీఐడీ అధికారులు పలు కేసులు పెట్టారు. నారాయణపై పదోతరగతి పరీక్షాపత్రం లీకేజీ తో పాటు, అమరావతి రాజధాని భూములకు సంబంధించి కేసులు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..