AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఖాకీ మాత్రమే కాదు.. యమ కంత్రి.. సీఐ సినిమ్యాటిక్ స్కెచ్‌ మాములుగా లేదుగా!

ఈ మధ్య కొందరు పోలీసులు.. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే కేసులను పట్టించుకోవడం పక్కన పెట్టి.. సివిల్ పంచాయతీలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే చిల్లర రాలుతుందిగా మరి.. అందుకే ఈ మధ్య చాలా మంది పోలీసుల తీరును పడుతున్నారు. సివిల్ పంచాయతీలలో వేలు పెట్టడం, అవి బయటకు పొక్కితే వేటు వేయించుకొని ఖాళీగా కూర్చోవడం ఇదే పోలీసుల తీరుగా మారిపోయింది. తాజాగా అలాంటి ఘటనే కడప జిల్లాలో వెలుగు చూసింది.

Andhra News: ఖాకీ మాత్రమే కాదు.. యమ కంత్రి.. సీఐ సినిమ్యాటిక్ స్కెచ్‌ మాములుగా లేదుగా!
Crime News
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Nov 25, 2025 | 4:35 PM

Share

కడప జిల్లా ప్రొద్దుటూరులోని బంగారం వ్యాపారి శ్రీనివాసరావును గత మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఎత్తుకు వెళ్ళిన సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే శ్రీనివాసరావును ఆ రాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో అడ్డుకొని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్లింది స్వయానా పోలీసులే .. అయితే పోలీసులు అతనిని స్టేషనుకు తీసుకుని వెళ్ళారా అంటే కాదు.. అలా కాకుండా ఓ ప్రైవేట్ గోడౌన్ కు తీసుకువెళ్లి అక్కడ సివిల్ పంచాయతీకి సంబంధించి సెటిల్మెంట్కు పూనుకున్నారు..

బంగారం వ్యాపారి శ్రీనివాసును, అతని తమ్ముడు ఇద్దరినీ గూడౌన్ లో బంధించి ఒక రోజంతా ఉంచి సెటిల్మెంట్ చేశారు.. అయితే ఈ విషయం అంతా మీడియాకు పొక్కటంతో శ్రీనివాసరావు, అతని తమ్ముడు విడుదల చేశారు. కానీ వారి ఇంటిలో ఉన్న ఏడు కోట్ల రూపాయలకు సంబంధించిన స్థలం దస్తావేజులను అలాగే శ్రీనివాసరావు బంగారం షాపునకు సంబంధించిన తాళాలను తీసుకొని వెళ్లారు.. ఈ విషయం కూడా బయటకు రావడంతో ఏం చేయాలో అర్థం కాక.. వారిపై ఉన్న పాత కేసులను వెలికి తీశారు. ఇద్దరు అన్నదమ్ములపపై ఆర్థికలావాదేవీల కేసుపెట్టి సోమవారం కోర్టులో హాజరుపర్చారు.

కానీ కోర్టు అక్కడ పోలీసులకే చివాట్లు పెట్టిందట. సివిల్ పంచాయతీలో పోలీసుల పనితీరును తప్పు పట్టినట్టు సమాచారం. దీంతో వన్‌టౌన్‌ సిఐ తిమ్మారెడ్డి వ్యవహార శైలి ఉన్నతాధికారులకు చికాకు తెంపించినట్లు తెలుస్తుంది.. ఈ నేపథ్యంలోనే అతన్ను విఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారట.. సివిల్ పంచాయతీకి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్న తిమ్మారెడ్డి వ్యవహార శైలిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. అయితే సీఐ తిమ్మారెడ్డి తన ఇంటెన్షనల్ గా ఈ వ్యవహారాన్ని చేసి ఉండడని.. ఎవరో ఉన్నత స్థాయి అధికారి చెప్తేనే ఇందులో పాల్గొని ఉంటాడనేది బయట నడుస్తున్న చర్చ.

అయితే ఈ వ్యవహారంలో తప్పుగా ప్రవర్తించిన సీఐ తీరుపై పోలీసు వర్గాలే కాకుండా స్థానిక ప్రొద్దుటూరు ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.. పోలీసులను నమ్మి న్యాయం జరుగుతుందని స్టేషన్‌కు వెళతామని.. కానీ పోలీసులే ఇలా సెటిల్మెంట్లు, పంచాయతీలు చేస్తుంటే సామాన్య ప్రజలు ఎవరి దగ్గరకు వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు..ఇప్పటికైనా సివిల్ పంచాయతీలలో పోలీసులు పాల్గొనకుండా ఉంటే బాగుంటుందని ప్రొద్దుటూరు స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us