వామ్మో.. ఇంత ప్రమాదకర భక్తిని ఎక్కడైనా చూశారా?
Sri Subrahmanya Swamy Rathotsavam: చూసే వారికి ఒళ్ళు గగ్గుర్లు పుట్టేలా మహిళలు, పిల్లలు, సైతం శూలాలు గుచ్చుకొని తమ భక్తిని చాటుకున్నారు. అలా రథోత్సవంలో గుచ్చుకోవడం వలన తమ కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం. ఇంకెందుకు లేట్ మీరు కూడా చూసేయండి

హరోం.. హర.. హర.. అన్న నామస్మరణలు చేస్తూ పదునైన ఇనుప కొక్కిల్లు, అస్త్రాలు, వీపుకు, బుగ్గలకు, కుచ్చుకొని తమిళులు తమ భక్తికి చాటుకుంటు కన్నుల పండుగగా ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీ సుబ్రమణ్యం స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తమిళుల ఆరాధ్యదైవం అయిన శ్రీ సుబ్రమణ్యం స్వామి జయంతి సందర్భంగా వైభవంగా శ్రీ సుబ్రమణ్యం స్వామి రథోత్సవం తమిళులు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ పాత ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉదయం నుండే తమిళులు చేరుకొని జమ్మి వృక్షం కు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడే బుగ్గలకు, వీపుకు పదునైన ఇనుప కొక్కిల్లు,అస్త్రాలు, కుచ్చుకొని హరోం.. హర.. ఓం నమ:శివయా.. అంటూ సమరిస్తూ తమిళులు తమ భక్తిని చాటుకుంటు పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహించారు
చూసే వారికి ఒళ్ళు గగ్గుర్లు పుట్టేలా మహిళలు, పిల్లలు, సైతం శూలాలు గుచ్చుకొని తమ భక్తిని చాటుకున్నారు. అలా రథోత్సవంలో గుచ్చుకోవడం వలన తమ కోరికలు నెరవేరుతాయని వారి నమ్మకం. కానీ, ఆ శూలాలు కుచ్చేటప్పుడు రక్తం బొట్టు కూడా బయటకు రాకపోవడం ఇక్కడి విశేషం,శూలాలు కుచ్చుకున్న వారికి నొప్పి తెలియకుండా స్వామి వారి విభూతి పూసుకొని భక్తులు తమిళులు ముందుకు వెళుతారు. ఈ ఉత్సవాలకు ముందు సుబ్రహ్మణ్య స్వామి దీక్ష చేపట్టి నేడు స్వామి వారి జయంతి రోజు ఇలా పూజలు చేసి దీక్షలను విరమిస్తారు. రథోత్సవం లో కోవళిలతో చేసిన నృత్యాలు అందరిని అక్కట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంద్ర,కర్ణాటక, తమిళనాడు భక్తులు పాల్గొన్నారు.
