AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: యముడు బ్రేక్‌‌లో ఉన్నాడేమో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ధైర్యముంటేనే చూడండి

వాళ్లకి భూమ్మీద నూకలు ఇంకా ఉన్నట్టున్నాయి. వేగంగా వచ్చి రైల్వే గేటును ఢీకొట్టడంతో కారు ఆగింది కానీ.. లేకుంటే ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టి బీభత్సం జరిగి ఉండేది.

Viral: యముడు బ్రేక్‌‌లో ఉన్నాడేమో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ధైర్యముంటేనే చూడండి
Viral
Fairoz Baig
| Edited By: |

Updated on: Nov 21, 2024 | 5:56 PM

Share

వాళ్లకి భూమ్మీద నూకలు ఇంకా ఉన్నట్టున్నాయి. వేగంగా వచ్చి రైల్వే గేటును ఢీకొట్టడంతో కారు ఆగింది కానీ.. లేకుంటే ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టి బీభత్సం జరిగి ఉండేది. రైలు గేటు ముందు బ్రేక్‌ వేసి ఆపాల్సిన డ్రైవర్‌ ఏదో ఆలోచనలో బ్రేక్‌ వేయబోయి ఎక్స్‌లేటర్‌ను బలంగా తొక్కాడు. దీంతో కారు ఒక్కసారిగా రైలు గేటును బలంగా ఢీకొట్టి అందులో ఇరుక్కుపోయింది. అదే సమయంలో పట్టాలపై వేగంగా దూసుకొచ్చిన రైలును చూసి కారులో వారికి గుండె ఆగినంత పనైంది. రైలు గేటును కొడితే కొట్టాం కానీ, లేకుంటే రైలు కింద పడి నుజ్జయిపోయి ఉండేవాళ్లమంటూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణాలైతే దక్కాయి కానీ కేసు మాత్రం నమోదైంది.

ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ సమీపంలోని కారంచేడు రైల్వే గేట్ వద్ద పెనుప్రమాదం తప్పింది. తెల్లవారు జామున కారంచేడు నుంచి చీరాల వస్తున్న ఓ కారు అదుపుతప్పి కారంచేడు రైల్వే గేటును బలంగా ఢీ కొట్టింది. బ్రేక్‌ వేయబోయి ఎక్స్‌లేటర్‌ను మరింత బలంగా తొక్కడంతో కారు ముందుకు దూసుకుపోయి రైల్వే గేటను ఢీకొట్టి ఇరుక్కుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్‌తో సహా మరో వ్యక్తి ఉన్నాడు. కారు బలంగా ఢీకొనడంతో రైల్వే గేటు దెబ్బతినడంతో పాటుగా సగానికి పైగా కారు గేటులోకి దూసుకుపోయింది. కాస్తంత ఉంటే కారు గేటు వేసి ఉండగానే ట్రాక్‌పైకి దూసుకువెళ్లేది. అదే సమయంలో అటు వచ్చిన రైలు కారును ఢీకొట్టి ఉంటే.. బీభత్సం జరిగి ఉండేది. అయితే రైల్వే గేటు కారును నిలువరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలో ట్రాక్‌పై రైలు రావడం, కారు దగ్గర ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ సమాచారం అందుకున్న చీరాల రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్