AP Rains: ఓరి దేవుడా.! ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. అక్కడ భారీ వర్షాలు

హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

AP Rains: ఓరి దేవుడా.! ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. అక్కడ భారీ వర్షాలు
Ap Rains
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 21, 2024 | 4:56 PM

ఏపీ ప్రజలకు మరో బాంబ్ పేల్చింది వాతావరణ శాఖ. మళ్లీ రాష్ట్రమంతటా వర్షాలు దంచికొట్టనున్నాయని పేర్కొంది. రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 26వ తేదీ నుంచి ఏపీపై వర్షాల ప్రభావం ఉంటుందని.. వర్షాల ప్రభావం మూడు రోజులపాటు కొనసాగుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ తెలిపారు.

ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా

ఇవి కూడా చదవండి

మరోవైపు అటు మంచు.. ఇటు చలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. మునుపెన్నడూ లేనివిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరగనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో వారం రోజుల పాటు వాతావరణం డ్రైగానే ఉంటుందని ప్రకటించారు. తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 12 డిగ్రీలకు పడిపోయింది ఉష్ణోగ్రత. హైదరాబాద్‌లో కూడా చల్ల గాలులు వణికిస్తున్నాయి. ఇక, ఏపీలో మరింత తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయ్‌. అల్లూరి జిల్లా ఏజెన్సీలో రోజురోజుకీ పడిపోతున్నాయ్‌. మినుములూరులో 9°C సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పాడేరులో ఉష్ణోగ్రత 11°C వరకు పడిపోయాయి.

ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..

వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా సపోర్టు అందించాలి.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ స్పష్టం చేశారు.

ఇది చదవండి: బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? తింటే ఇక పోతారు అంతే..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి