Mega DSC Syllabus: మరో వారంలో డీఎస్సీ కొత్త సిలబస్‌ విడుదల.. మంత్రి నారా లోకేశ్‌

మెగా డీఎస్సీకి సంబంధించి మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన జారీ చేశారు. మరో వారం రోజుల్లో డీఎస్సీ కొత్త సిలబస్ జారీ చేస్తామని అన్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ కంటే ముందుగానే సిలబస్ విడుదల చేయనున్నట్ల ఆయన తెలిపారు..

Mega DSC Syllabus: మరో వారంలో డీఎస్సీ కొత్త సిలబస్‌ విడుదల.. మంత్రి నారా లోకేశ్‌
Mega DSC Syllabus
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 21, 2024 | 4:35 PM

అమరావతి, నవంబర్‌ 21: మెగా డీఎస్సీపై కూటమి సర్కార్‌ రోజుకొక్క అప్‌డేట్‌ విడుదల చేస్తుంది. ఇప్పటికే విడుదలకావల్సిన డీఎస్సీ నోటిఫికేషన్‌ పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తిరిగి ఎప్పుడు జారీ చేస్తారన్న దానిపై స్పష్టత కొరవడింది. ఎస్సీ వర్గీకరణపై నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పిన తర్వాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ 2, 3 నెలలపాటు వాయిదా వేసినప్పటికీ అనుకున్న సమయానికి టీచర్ల భర్తీ చేస్తామని గట్టిగా చెబుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ ఏపీ విద్యాశాఖ డీఎస్సీ సిలబస్‌కి సంబంధించి నిర్ధిష్ట ప్రకటన జారీ చేయలేదు. పాత సిలబస్‌ ప్రకారంగానే డీఎస్సీ నిర్వహిస్తామని గతంలో చెప్పినప్పటికీ తాజాగా ఈ నిర్ణయంపై యూటర్న్‌ తీసుకుంది. డీఎస్సీ నిర్వహణకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అభ్యర్థుల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్‌ను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో వారం రోజుల్లో డీఎస్సీ సిలబస్‌కు సంబంధించిన ప్రటకన విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ కంటే ముందుగా సిలబస్‌ను విడుదల చేయాలని మంత్రి నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ముగిసిన తెలంగాణ టెట్‌ దరఖాస్తులు.. మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు నవంబర్ 20వ తేదీతో ముగిసింది. నవంబరు 19న రాత్రి 8 గంటల వరకు మొత్తం 2,48,174 దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు, టెట్‌ ఛైర్మన్‌ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. పేపర్‌ 1కు 71,655, పేపర్‌ 2కు 1,55,971, రెండు పేపర్లకు కలిపి 20,546 దరఖాస్తులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు వివరాల్లో పొరపాట్లు ఉంటే నవంబరు 22లోపు సవరించుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నర్సింహారెడ్డి తెలిపారు. తెలంగాణ టెట్ హాల్ టికెట్లు డిసెంబర్ 26న విడుదలవుతాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జనవరి 20వ తేదీ వరకు టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.