Hyderabad: లంగర్‌హౌస్‌లో ఘోరం.. ఆస్తిలో వాటా కోసం మామపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి..! వీడియో

ఆస్తి కోసం సొంత మామపై ట్రాఫిక్ పోలీస్ విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Hyderabad: లంగర్‌హౌస్‌లో ఘోరం.. ఆస్తిలో వాటా కోసం మామపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి..! వీడియో
Traffic Constable Attacks On Uncle
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 20, 2024 | 5:55 PM

హైదరాబాద్, నవంబర్ 20: ఆస్తి దగ్గర అల్లుడు, మామకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అయితే ఇంట్లో కూర్చుని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి బదులు రచ్చకెక్కి నానాయాగి చేశాడా అల్లడు. పైగా అతడు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌గా సర్కార్ కొలువు కూడా చేస్తున్నాడు. ఆస్తిలో తనకు వాటా ఇవ్వాల్సిందేనని షాపు వద్ద మామపై పోలీస్‌ అల్లుడు దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లోచోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌లోని లంగర్‌హౌ‌స్‌కి చెందిన కానిస్టేబుల్ ఎండీ షాహిద్ ఖాన్ అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా ఆస్తి విషయమై మామతో గొడవలు పడుతున్నాడు. ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వాలంటూ ఇందిరా నగర్లో ఉంటున్న మామ అబ్దుల్ వాహిద్‌పై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన అబ్దుల్‌ వాహిద్‌ అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరు ఇలా బహిరంగంగా పట్లుపట్టడం గమనించిన స్థానికులు వారిద్దరిని విడిపించి గొండ సర్దుమనిగేలా చేశారు.

ఇవి కూడా చదవండి

దీంతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ షాహిద్ ఖాన్ తనకి ఆస్తిలో వాటా ఇవ్వకపోతే మామ కుటుంబ సభ్యులందరి అంతు చూస్తానాంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తమను ఎవరు ఏమి చేయలేరంటూ మామ అబ్దుల్‌ వాహిద్‌ కుటుంబం షాహిద్ ఖాన్‌పై చిందులేశారు. అనతరం తమకు కానిస్టేబుల్ షాహిద్ నుంచి ప్రాణ హాని ఉందంటూ బాధితుడు అబ్దుల్ మోహిద్ జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. నిందితుడి పై కేసు నమోదు చేసి శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.