Hyderabad: గోల్డ్ బిస్కెట్స్ కావాల్నా నాయనా..! ప్లాట్లు, డబుల్ గోల్డ్ స్కీమ్ అంటూ నిండా ముంచారు.. మామూలు స్కామ్ కాదు..
ప్లాట్లు, గోల్డ్ స్కీమ్, డబుల్ గోల్డ్ స్కీమ్.. గోల్డ్ చిట్ స్కీమ్.. ఇన్ని స్కీముల పేరు చెప్పి ఆ కంపెనీ ప్రజల్నీ నిండా ముంచింది.. ఒకటి కాదు.. రెండు కాదు .. వందల కోట్లను దోచుకుంది.. ఈ భారీ కుంభకోణం హైదరాబాద్ నరగంలో బయటపడింది. గోల్డ్ బిస్కెట్స్ పేరుతో 300 కోట్లు కొట్టేసింది 12 వెల్త్ సర్వీసెస్ కంపెనీ.
ప్లాట్లు, గోల్డ్ స్కీమ్, డబుల్ గోల్డ్ స్కీమ్.. గోల్డ్ చిట్ స్కీమ్.. ఇన్ని స్కీముల పేరు చెప్పి ఆ కంపెనీ ప్రజల్నీ నిండా ముంచింది.. ఒకటి కాదు.. రెండు కాదు .. వందల కోట్లను దోచుకుంది.. ఈ భారీ కుంభకోణం హైదరాబాద్ నరగంలో బయటపడింది. గోల్డ్ బిస్కెట్స్ పేరుతో 300 కోట్లు కొట్టేసింది 12 వెల్త్ సర్వీసెస్ కంపెనీ. కూకట్‌పల్లి కేంద్రంగా జరిగిన ఈ మోసం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వందమంది కాదు.. రెండొందల మంది కాదు.. ఏకంగా 3600మందిని ముంచేసి బోర్డు తిప్పేశారు కేటుగాళ్లు. బాధితుల ఫిర్యాదుతో కంపెనీ ఎండీ కలిదిండి పవన్‌కుమార్‌తోపాటు 8మందిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..
8లక్షల 8వేల రూపాయలు చెల్లించి రెండు గుంటల స్థలం కొంటే.. 25 నెలలపాటు 32వేలు చొప్పున చెల్లిస్తామంటూ బురిడీ కొట్టించింది వెల్త్ సర్వీసెస్ కంపెనీ.
అలాగే, డబుల్ గోల్డ్ స్కీమ్ పేరిట మరో మోసానికి పాల్పడింది వెల్త్ సర్వీసెస్ కంపెనీ. నాలుగు లక్షలు పెట్టుబడి పెడితే.. ఏడాది తర్వాత 8లక్షలు విలువైన స్విట్జర్లాండ్ గోల్డ్ బిస్కట్ ఇస్తామంటూ కోట్లు కొల్లగొట్టింది.
గోల్డ్ చిట్ స్కీమ్ పేరుతోనూ జనాన్ని చీట్ చేసింది వెల్త్ సర్వీసెస్ కంపెనీ. 20 నెలల్లో ఐదు లక్షలు డిపాజిట్ చేస్తే… 19 నెలలపాటు 15వేలు చొప్పున చెల్లిస్తామని నమ్మించింది. ఆఖరి నెలలో 15వేలు ఎక్స్‌ట్రా కూడా ఇస్తామంటూ ఆశచూపించింది.
ఆ రకంగా 25 నెలలు చెల్లిస్తామంటూ ఈ కంపెనీ ప్రతినిధులు ప్రచారం చేశారు. దీంతో స్థలంతో పాటుగా డబ్బులు వెనక్కి వస్తాయంటూ బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారు.
అలాగే ఈ స్కీమ్‌లోకి కొత్తగా ఎవరినైనా చేర్పిస్తే 25 నెలలపాటు ప్రతి నెలా రూ.7200 చొప్పున చెల్లిస్తామని ఆశ చూపించారు.
ఇలా.. స్కీముల పేరు చెప్పి.. అనేక రకాలుగా ప్రజలను నమ్మించి.. మూడు వందల కోట్లు కొల్లగొట్టింది వెల్త్ సర్వీసెస్ కంపెనీ..
అయితే.. డబ్బులు రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు సైబరాబాద్ పోలీసులను బాధితులు ఆశ్రయించారు.. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడితోపాటు.. 8 మందిని అరెస్ట్ చేశారు. అయితే, ఇలాంటి మోసాలు పేపర్లు, టీవీల్లో చూస్తున్నప్పటికీ జనం ఏం తెలుసుకోకుండా.. కోట్లకు కోట్లు చెల్లించడం సంచలనంగా మారింది.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..